ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తప్పుడు మస్తర్లు వేస్తే చర్యలు

ABN, Publish Date - May 17 , 2025 | 12:30 AM

తప్పుడు మస్తర్లు వేస్తే చర్యలు తప్పవని డ్వామా పీడీ ఎస్‌.శారదాదేవి హెచ్చరించారు.

వేతనదారులతో మాట్లాడుతున్న డ్వామా పీడీ
  • డ్వామా పీడీ శారదాదేవి

  • చిత్తారపురం ఫీల్డ్‌ అసిస్టెంట్‌, ఏపీవోకు నోటీసులు

సంతకవిటి, మే 16 (ఆంధ్రజ్యోతి): తప్పుడు మస్తర్లు వేస్తే చర్యలు తప్పవని డ్వామా పీడీ ఎస్‌.శారదాదేవి హెచ్చరించారు. శుక్రవారం మం డల పరిషత్‌ కార్యాలయంలో ఉపాధి హామీ క్షేత్ర సహాయకులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి పనులపై ఆరా తీశారు. వేతనదారుడికి 100 రోజుల పని ఎందుకు కల్పించలేకపోతున్నారని ప్రశ్నించారు. కాలువలలో పూడికతీత లు సరిగా ఎందుకు చేపట్టడంలేదని నిలదీశారు. మండలంలోని 240 ఫాంపాండ్స్‌ ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ కేవలం 11 మాత్రమే పూర్తిచేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పని ప్రదేశాల్లో ప్లాస్టిక్‌ బాటిళ్లతో కాకుండా మట్టి కుండలు, బిందెలతో నీరు తీసుకువచ్చేలా వేతనదారులకు అవగాహ న కల్పించాలన్నారు. ముందుకు ఆమె చిత్తార పురంలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. రెండు పూటలా నిర్ధేశిత కొలతల్లో పనిచే స్తే రూ.307 వేతనం గిట్టుబాటు అవుతుంద న్నారు. ఈ సందర్భంగా మస్తర్లను పరిశీలించారు. చిత్తారపురం ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఒకేరోజు ఒక్కొక్కరి కి 8 నుంచి 9 సార్లు ఫొటోలు తీసి బినామీలు, వలసదారుల దొంగ మస్తర్లను యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్న ట్టు గుర్తించారు. దాంతో సంబంధి త ఫీల్డ్‌ అసిస్టెంట్‌, ఏపీవో హరనాథ రావుకు నోటీసులు జారీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో కె.సురేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2025 | 12:30 AM