ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చోరీ కేసులో నిందితుల అరెస్టు

ABN, Publish Date - Jul 11 , 2025 | 12:51 AM

స్థానిక రైల్వేస్టేషన్‌ కాలనీలో చోరీకి పాల్పడిన నిందితులను పట్టుకుని అరెస్టు చేశామని సీఐ జీఏవీ రమణ తెలిపారు.

గజపతినగరం, జూలై 10(ఆంధ్రజ్యోతి): స్థానిక రైల్వేస్టేషన్‌ కాలనీలో చోరీకి పాల్పడిన నిందితులను పట్టుకుని అరెస్టు చేశామని సీఐ జీఏవీ రమణ తెలిపారు. గురువారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌ కార్యాలయంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లా గోరంట్ల గ్రామా నికి చెందిన చిల్లర సురేష్‌, జల్లేపల్లి వెంకటేశ్వరరావు, దాసరి సుభాష్‌, విజయవాడ రామలింగేశ్వర కాలనీకి చెందిన నాగవీర భాస్కరరావులు గురువారం మధ్యాహ్నం రైల్వేస్టేషన్‌ పరిసర ప్రాంతంలో అనుమానా స్పదంగా తిరుగుతున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. ఈ మేర కు సిబ్బంది సహాయంతో దాడి చేసి, వారిని అదుపులోకి తీసుకుని విచా రణ చేపట్టగా నేరం అంగీకరించారని చెప్పారు. ఈనెల 1వ తేదీన కారు ను అద్దెకు తీసుకుని సాలూరు మండలంలోని మక్కువ గ్రామంలో శంబర పోలమాంబ అమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో సాలూరు పట్టణంలో తాళంవేసి ఉన్న ఇంటిలో చోరీకి పాల్పడ్డారని ఆయన తెలిపారు. అనంతరం తిరుగు ప్రయాణంలో గజపతినగరం రైల్వేస్టేషన్‌ కాలనీలో తాళంవేసి ఉన్న పాండ్రంకి పార్వతి ఇంటిలో చోరీకి పాల్పడ్డారని చెప్పారు. 200 గ్రాముల వెండి, రూ.10వేల నగదు చోరీ జరిగినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. నిందితుల నుంచి 200 గ్రాముల వెండితో పాటు రూ.1150నగదు, కారును సీజ్‌ చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్‌నాయుడు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2025 | 12:51 AM