ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Water Quality Testing పక్కాగా నీటి నాణ్యతా పరీక్షలు

ABN, Publish Date - Mar 31 , 2025 | 11:16 PM

Accurate Water Quality Testing జిల్లాలో ఆరోగ్య, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖల పరిధిలో చేపడుతున్న నీటి నాణ్యతా పరీక్షలు పక్కాగా ఉండాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ నుంచి టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు.

టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌

పార్వతీపురం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆరోగ్య, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖల పరిధిలో చేపడుతున్న నీటి నాణ్యతా పరీక్షలు పక్కాగా ఉండాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ నుంచి టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. రెండు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు చేప ట్టాలని సూచించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ పరిధిలో చేపట్టే 14 రకాల వాటర్‌ టెస్ట్‌లను రోజూ పర్యవేక్షించి.. తమకు నివేదికలు అందజేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియపై క్షేత్ర స్థాయిలో అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. బయోలాజికల్‌ కంటెంట్‌, క్లోరిన్‌ లెవెల్‌ టెస్ట్‌లను ఎలా చేపడుతున్నారని ప్రశ్నించారు. నీటి నాణ్యతా పరీక్షల్లో ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్‌ అంశాలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలు సరిగా లేకపోతే ఏం చేయాలనే దానిపై దృష్టిసారించాల న్నారు. వేసవిలో నీరు కలుషితమయ్యే అవకాశం ఉంటుందని, నిత్యం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. రోజురోజుకూ ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాలు, సంస్థలు, సంఘాల సహకారం తీసుకోవాలన్నారు. వేసవి ఉష్ణోగ్రతలపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఉపాధి హామీ పనుల ప్రదేశాల్లో నీడ, తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.

నీటితొట్టెల నిర్మాణాలు ప్రారంభించాలి

జిల్లాలో పశువుల నీటితొట్టెల నిర్మాణాలు ప్రారంభించాలని కలెక్టర్‌ ఆదేశించారు. పశుసంవర్థక శాఖ ప్రతిపాదనల మేరకు 411 నీటి తొట్టెలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. వాటి నిర్మాణాల ప్రక్రియలో ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం సూచించారు. మండలాల్లో తాగునీటి సమస్యలపై తక్షణమే స్పందించాలని ఎంపీడీవోలను ఆదేశించారు. వచ్చే మూడు నెలల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. మండలాల్లో తాగునీటి సంబంధిత ఫిర్యాదులకు ప్రత్యేక సెల్‌ నిర్వహించాలని, 24 గంటల్లో సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

Updated Date - Mar 31 , 2025 | 11:16 PM