Fever Survey పక్కాగా ఫీవర్ సర్వే
ABN, Publish Date - May 03 , 2025 | 11:08 PM
Accurate Fever Survey గిరిజన గ్రామాల్లో పక్కాగా ఫీవర్ సర్వే చేపట్టాలని, మలేరియా ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు ఆదేశించారు. శనివారం తాడికొండ పీహెచ్‌సీ, గుమ్మలో స్ర్పేయింగ్‌ను పరిశీలించారు.
డీఎంహెచ్‌వో భాస్కరరావు
గుమ్మలక్ష్మీపురం, మే 3 (ఆంధ్రజ్యోతి): గిరిజన గ్రామాల్లో పక్కాగా ఫీవర్ సర్వే చేపట్టాలని, మలేరియా ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు ఆదేశించారు. శనివారం తాడికొండ పీహెచ్‌సీ, గుమ్మలో స్ర్పేయింగ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు, వైద్య సిబ్బందికి పలు సూచనలిచ్చారు. పీహెచ్‌సీలో వైద్యసేవలపై ఆరా తీశారు. మలేరియా పాజివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. దోమల నివారణకు చేపడుతున్న ఐఆర్‌ఎస్ స్ర్పేయింగ్ గ్రామాల్లో పూర్తిస్థాయిలో జరిగేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. స్ర్పేయింగ్ జరగబోయే గ్రామాలను సబ్ యూనిట్ అధికారులు ముందస్తుగా తెలియజేసి కచ్చితంగా నిర్వహించాలన్నారు. దీనిపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రిలో సిబ్బంది అన్ని వేళలా అందుబాటులో ఉంటూ రోగులకు ఇబ్బంది లేకుండా చూడాలని తెలిపారు. వైద్య సేవలపై రోగుల అభిప్రాయాలను స్వీకరించాలన్నారు. గుమ్మలో ఐఆర్‌ఎస్ కార్య క్రమాన్ని తనిఖీ చేశారు. ఇంటింటికీ దోమల మందు పిచికారీ చేస్తున్న తీరును గమనించిఅసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా ప్రోగ్రాం అధికారి జగన్మోహన్‌రావు, వైద్యాధికారులు ఎం.బుద్ధేశ్వరరావు, పి.అభిలాష్, సీహెచ్‌వో పద్మ, సబ్ యూనిట్ అధికారి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 03 , 2025 | 11:08 PM