ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

manyam ప్రకృతి అందాలకు నిలయం.. మన్యం

ABN, Publish Date - Jun 17 , 2025 | 11:37 PM

A Haven of Natural Beauty... manyam పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రకృతి సహజసిద్ధ అందాలకు కొదవే లేదు. ఎత్తయిన కొండలు.. జలపాతాలు.. వ్యూపాయింట్లు, అడ్వంచర్‌ పార్కులు, ప్రముఖ దేవాలయాలు.. ఇలా ఎన్నో ఉన్నాయి. ప్రకృతి ప్రేమికులను సైతం కట్టిపడేసే ప్రదేశాలెన్నో ఉన్నాయి. అందుకే తరచూ పర్యాటకులు ‘మన్యం’లో ప్రాంతాలను సందర్శిస్తుంటారు. కార్తీకమాసంలో పిక్నిక్‌స్పాట్‌లుగా మార్చుకుంటారు.

సందర్శకులను విశేషంగా ఆకట్టుకునే ఆడలి వ్యూపాయింట్‌
  • పిక్నిక్‌ స్పాట్లుకు కొదవే లేదు..

  • నేడు ప్రపంచ పిక్నిక్‌ దినోత్సవం

సీతంపేట రూరల్‌, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రకృతి సహజసిద్ధ అందాలకు కొదవే లేదు. ఎత్తయిన కొండలు.. జలపాతాలు.. వ్యూపాయింట్లు, అడ్వంచర్‌ పార్కులు, ప్రముఖ దేవాలయాలు.. ఇలా ఎన్నో ఉన్నాయి. ప్రకృతి ప్రేమికులను సైతం కట్టిపడేసే ప్రదేశాలెన్నో ఉన్నాయి. అందుకే తరచూ పర్యాటకులు ‘మన్యం’లో ప్రాంతాలను సందర్శిస్తుంటారు. కార్తీకమాసంలో పిక్నిక్‌స్పాట్‌లుగా మార్చుకుంటారు. కుటుంబాలతో ఇక్కడకు వచ్చి సందడి చేస్తుంటారు. స్నేహితులు, బంధువులతో కలిసి రోజంతా ఉల్లాసంగా ఉత్సాహం గడుపుతారు. జిల్లాలో పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండలో ఎన్నో పిక్నిక్‌ స్పాట్లు ఉన్నాయి. ప్రధానంగా సీతంపేట మన్యంలో సున్నపుగెడ్డ, ఆడలి వ్యూ పాయింట్‌, ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్క్‌, మెట్టుగూడ జలపాతం, సాలూరు ఏజెన్సీలో ఉన్న జలపాతాల వద్ద సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. ఎటు చూసినా పచ్చదనమే కనిపించడంతో కార్తీకమాస సీజన్‌లో విందులు, వినోదాలు ఏర్పాటు చేసుకుని ఆనందంగా గడుపుతారు. పిక్నిక్‌ స్పాట్లుగా గుర్తింపు పొందిన ఆయా పర్యాటక ప్రాంతాల్లో వసతి, రవాణా సదుపాయాలను మెరుగుపరచాల్సి ఉంది. దీనివల్ల సందర్శకుల సంఖ్య పెరగడంతో పాటు ప్రభుత్వానికి భారీగా ఆదాయం రానుంది. గిరిజన యువతకు కూడా స్థానికంగానే ఉపాధి దొరకనుంది. సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏల పరిధిలోని పర్యాటక ప్రాంతాలపై ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రానున్న రోజుల్లో జిల్లాలో సందర్శక ప్రాంతాలు మరింత అభివృద్థి చెందే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. నేడు ప్రపంచ పిక్నిక్‌ దినోత్సవం సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

Updated Date - Jun 17 , 2025 | 11:37 PM