ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

A Golden Era for the Tanks చెరువులకు మహర్దశ

ABN, Publish Date - May 26 , 2025 | 10:58 PM

A Golden Era for the Tanks జిల్లా పరిధిలో సాగునీటి చెరువులకు మహర్దశ పట్టనుంది. వాటి అభివృద్ధికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉపాధి నిధులతో వాటి పనులు చేపట్టాలని ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లాలో 122 చెరువుల పనులకు సుమారు రూ.10.49 కోట్లు కేటాయించింది.

అభివృద్ధి కానున్న కృష్ణ సాగరం చెరువు

‘ఉపాధి’ నిధులతో పనులు

జల వనరులశాఖకు పర్యవేక్షణ బాధ్యత

గరుగుబిల్లి, మే 26(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిధిలో సాగునీటి చెరువులకు మహర్దశ పట్టనుంది. వాటి అభివృద్ధికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉపాధి నిధులతో వాటి పనులు చేపట్టాలని ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లాలో 122 చెరువుల పనులకు సుమారు రూ.10.49 కోట్లు కేటాయించింది. జల వనరులశాఖకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. గత వైసీపీ ప్రభుత్వం సాగునీటి చెరువులపై దృష్టి సారించలేదు. దీంతో గతంలో నిర్మించిన మదుములు, కల్వర్టులు, చప్టాలు శిఽథిలావస్థకు చేరుకున్నాయి. చెరువుల్లో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టడంతో రైతులు కొన్నాళ్లుగా సాగునీటికి పడరాని పాట్లు పడుతున్నారు. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం సాగునీటి చెరువులపై దృష్టి సారించింది. మండలాలవారీగా చెరువుల పరిస్థితిపై జల వనరులశాఖ సిబ్బంది సర్వే నిర్వహించి ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు ప్రభుత్వం జిల్లాలో 11 మండలాల పరిధిలో 122 చెరువులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఉపాధి నిధులు మంజూరు చేసింది. దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గుర్తించినవి..

జిల్లాలో తొలి విడతగా పార్వతీపురం మండలంలో 15 చెరువులు, బలిజిపేటలో 9, సీతానగరంలో 15, సాలూరులో 4 , పాచిపెంటలో 2 , మక్కువలో 9, కురుపాంలో 7, గుమ్మలక్ష్మీపురంలో 6 , జియ్యమ్మవలసలో 37 , గరుగుబిల్లిలో 11, కొమరాడలో 7 చెరువులను గుర్తించారు. రెండో దశలో మరికొన్ని చెరువు పనులు చేపట్టనున్నారు.

మదుములకు మోక్షం

గత కొన్నాళ్లుగా చెరువులకు చెందిన మదుములు శిఽథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో భారీ వర్షాల సమయంలో గండ్లు పడుతున్నాయి. మదుములు లేని కారణంగా నీరు దిగువకు వెళ్లిపోతుంది. వర్షాధారంతో సాగు చేసే రైతులకు ఏటా సాగునీటి ఇక్కట్లు తప్పడం లేదు. వారి సమస్యలను తెలుసుకున్న ప్రభుత్వం ఉపాధి నిధులతో మదుముల నిర్మాణం చేపట్టనుంది. అయితే ఖరీఫ్‌కు ముందుగానే పూర్తిస్థాయిలో పనులు నిర్వహిస్తే రైతులకు ఇబ్బందులు తప్పనున్నాయి. 122 చెరువులకు సంబంధించి మెటీరియల్‌ పనులతో పాటు గండ్లు పూడ్చివేత బాధ్యతను జల వనరులశాఖకు అప్పగించారు. మండల ఇంజనీర్ల ఆధ్వర్యంలో పనులు జరగ నున్నాయి. సంబంధిత ఎంపీడీవోలు బిల్లుల చెల్లింపులు చేయాల్సి ఉంది. పనులు పూర్తయిన తర్వాత ఎంబుక్‌లు మండల కార్యాలయానికి అందజేయాలి.

నిబంధనల మేరకు పనులు

ఉపాధి హామీ పథకం నిబంధనల మేరకు జిల్లాలో 122 సాగునీటి చెరువుల అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. వాటికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించాం. పూర్తిస్థాయిలో రికార్డులు నిర్వహించాలి. పనులు నిర్వహించిన ప్రాంతంలో నిధులు వివరాలను తెలియపర్చే విధంగా సమాచార బోర్డును ఏర్పాటు చేయాలి. పనుల పర్యవేక్షణకు క్వాలిటీ సిబ్బందిని నియమించాం. సామాజిక బృందం తనిఖీ చేసే సమయంలో సమాచారాన్ని అందుబాటులో ఉంచాలి. నాణ్యత లోపాలు ఉన్నట్లు తేలితే చర్యలు తప్పవు. సంబంధిత సిబ్బందే బాధ్యత వహించాలి.

కె.రామచంద్రరావు, పీడీ, డ్వామా, పార్వతీపురం మన్యం

Updated Date - May 26 , 2025 | 10:58 PM