సమస్యల వెల్లువ
ABN, Publish Date - Mar 18 , 2025 | 12:11 AM
ప్రజల నుంచి వచ్చిన వినతులను పూర్తిస్థాయిలో పరిశీలించి, ఆ సమ స్యలను వారంలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకో వాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అధికారులను ఆదేశిం చారు.
పార్వతీపురం, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వచ్చిన వినతులను పూర్తిస్థాయిలో పరిశీలించి, ఆ సమ స్యలను వారంలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకో వాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అధికారులను ఆదేశిం చారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో నిర్వ హించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 106 విన తులను స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదే శించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో అశుతోష్ శ్రీవాస్తవ, ఇన్‌చార్జి జేసీ కె.హేమలతతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎస్పీ గ్రీవెన్స్‌కు 14..
బెలగాం, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో 14 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి తెలి పారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఆయ న పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. అర్జీదారులను నుంచి స్వయంగా ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. డీసీఆర్‌బీ సీఐ ఆదాం, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
రుణాలు మంజూరు చేయండి
సీతంపేట రూరల్, మార్చి 17(ఆంధ్రజ్యోతి): ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు తమ రుణాలు మంజూరు చేయా లని పలువురు గిరిజనులు కోరారు. ఈ మేరకు సోమవా రం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఇన్‌చార్జి పీవో సి.య శ్వంత్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సమ స్యల పరిష్కార వేదికలో వారు తమ సమస్యలను వెల్లడించారు. పీజీఆర్‌ఎస్‌కు 54 వినతులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో ఏపీవో జి.చిన్నబాబు, డీడీ అన్నదొర, పీహెచ్‌వో వెంకట గణేష్, డిప్యూటీ ఈవో రవి ప్రసన్నకు మార్, టీడబ్ల్యూ డీఈఈ సింహాచలం, ఐకేపీ ఏపీడీ సన్యాసినాయుడు, ఏటీడబ్ల్యూవో మంగవేణి పలు శాఖల కు చెందిన అధికారులు పాల్గొన్నారు.
పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలి
పాలకొండ, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): పీఆర్సీ కమిషన్ 2023 జూలై 1 నుంచి ఏర్పాటు చేయాలని పాలకొండ పెన్షనర్ల సంఘం సభ్యులు కేవీ రమణమూర్తి, సీహెచ్ అచ్యుతరావు కోరారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు సోమవారం స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రం అం దించారు. పలువురు పెన్షనర్ల సంఘం సభ్యులు ఉన్నారు.
శివారు గ్రామాలకు నీరందించాలి
తోటపల్లి ఎడమ కాలువ ద్వారా పాలకొండ మండల శివారు గ్రామాలకు సాగునీరు అందించాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు, తోటప ల్లి ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ఆలుబిల్లి పార్థసారధి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం డీఆర్వో హేమలతకు వితిపత్రాన్ని అందించారు.
రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
పార్వతీపురం, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): రిటైర్డ్ ఉద్యో గుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరిం చాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు డీజీ ప్రసాద రావు, రాష్ట్ర సహాధ్యక్షుడు చౌదరినాయుడు కోరారు. సోమ వారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఐటీడీఏ పీవో అశుతోష్ శ్రీవాస్తవకు వినతిపత్రం అందించారు.
Updated Date - Mar 18 , 2025 | 12:11 AM