90% Pension Distribution Completed 90 శాతం పింఛన్ల పంపిణీ
ABN, Publish Date - May 31 , 2025 | 11:31 PM
90% Pension Distribution Completed జిల్లా వ్యాప్తంగా శనివారం 90 శాతం మేర ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. ఈ నెల ఒకటో తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక రోజు ముందుగానే ఈ ప్రక్రియ చేపట్టారు.
గరుగుబిల్లి, మే 31 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా శనివారం 90 శాతం మేర ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. ఈ నెల ఒకటో తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక రోజు ముందుగానే ఈ ప్రక్రియ చేపట్టారు. శనివారం తెల్లవారుజామునే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల వద్దకు వెళ్లి పింఛన్ సొమ్ము అందించారు. జిల్లాలో 15 మండలాలు, మూడు పట్టణాల పరిధిలో 1,39,111 మంది పింఛన్‌దారులు ఉన్నారు. మొదటి రోజు 1,23,075 మందికి పింఛన్ నగదు అందించారు. మొత్తగా రూ. 59.32 కోట్లను పింఛన్ల రూపంలో లబ్ధిదారులకు అందజేశారు. ఒక రోజు ముందుగానే పింఛన్ అందిం చడంతో పింఛన్‌దారులు ఆనందం వ్యక్తం చేశారు.
Updated Date - May 31 , 2025 | 11:31 PM