క్యూఆర్ కోడ్ ద్వారా సమస్యలు చెప్పొచ్చు
ABN, Publish Date - Jun 13 , 2025 | 12:56 AM
ఆర్టీసీ ప్రయాణికులు సమస్యలు ఏమైనా ఉంటే కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా నేరుగా తెలియపరచవచ్చునని ఆర్టీసీ డీపీటీవో కె.పద్మావతి తెలిపారు. గురువారం సాయంత్రం ఆమె కాంప్లెక్స్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ
ఆర్టీసీ డీపీటీవో పద్మావతి
అనకాపల్లి టౌన్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ప్రయాణికులు సమస్యలు ఏమైనా ఉంటే కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా నేరుగా తెలియపరచవచ్చునని ఆర్టీసీ డీపీటీవో కె.పద్మావతి తెలిపారు. గురువారం సాయంత్రం ఆమె కాంప్లెక్స్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రయాణికుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా ఈ క్యూఆర్ కోడ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అందువల్ల ప్రయాణికులు ఈ క్యూఆర్ కోడ్‌ను సేవ్ చేసుకొని సమస్యలు ఏమైనా ఉంటే తెలియపరచాలన్నారు. బస్సుల వేళల బోర్డులు కూడా ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణికులకు తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టామన్నారు. ప్రయాణికులు కూర్చోవడానికి కుర్చీలన్నీ బాగు చేశామన్నారు. డస్ట్‌బిన్‌లను కూడా ఏర్పాటు చేశామన్నారు. దుకాణాల్లోని ఎంఆర్‌పీ ధరల బోర్డును ఏర్పాటు చేయించామన్నారు.
రేపటి నుంచి బస్‌పాస్‌ల జారీ
ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో బస్‌పాస్‌లను శనివారం నుంచి జారీ చేస్తామని పద్మావతి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ మార్పుల కారణంగా గురువారం నుంచి ఇవ్వాల్సిన బస్‌పాస్‌లను నిలిపివేశామన్నారు. సాఫ్ట్‌వేర్ ప్రక్రియ శుక్రవారానికి పూర్తవుతుందని శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి విద్యార్థులకు, జర్నలిస్టులకు పాస్‌లు అందజేస్తామన్నారు. శనివారం రెండో శనివారం కావడంతో మధ్యాహ్నం వరకే పాస్‌ల పంపిణీ ఉంటుందని తెలిపారు. ఈమె వెంట ఆర్టీసీ డీఎం ఎల్‌వీరావు, సిబ్బంది ఉన్నారు.
Updated Date - Jun 13 , 2025 | 12:56 AM