యోగా సందడి
ABN, Publish Date - Jun 21 , 2025 | 11:16 PM
జిల్లా వ్యాప్తంగా శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా యంత్రాంగం విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమంలో ఉన్నప్పటికీ జిల్లా, డివిజన్, మండల, పంచాయతీ స్థాయిల్లో ఉన్న అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో 22 మండలాల్లోని 2,893 ప్రదేశాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.
ఘనంగా యోగా దినోత్సవం
జిల్లా వ్యాప్తంగా 2,893 ప్రదేశాల్లో 1.84 లక్షల మంది హాజరు
పాడేరు, జూన్ 21(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా యంత్రాంగం విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమంలో ఉన్నప్పటికీ జిల్లా, డివిజన్, మండల, పంచాయతీ స్థాయిల్లో ఉన్న అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో 22 మండలాల్లోని 2,893 ప్రదేశాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో 1,84,530 మంది యోగాసనాలు వేశారు. పాడేరు కలెక్టరేట్‌లో డీఆర్‌వో కె.పద్మలత, ఐటీడీఏ కార్యాలయంలో ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో, పలు ప్రభుత్వ కార్యాలయాల్లో యోగాసనాలు వేశారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో డుంబ్రిగుడ మండలం అరకు పైనరీలో అధికారులు, సిబ్బంది యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చింతపల్లి, అరకులోయ సబ్‌డివిజనల్ కేంద్రాలతో పాటు, మండల, పంచాయతీ స్థాయిల్లోనూ ప్రజలు యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.
Updated Date - Jun 21 , 2025 | 11:16 PM