ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బాలికల బడికి సొంత గూడు ఎన్నడో?

ABN, Publish Date - Jul 01 , 2025 | 12:22 AM

నియోజకవర్గ కేంద్రంలో మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల బాలికల ఉన్నత పాఠశాల ఆరేళ్లుగా అద్దె భవనంలోనే కొనసాగుతోంది. ఈ పాఠశాలకు స్థలం కేటాయించిన గత వైసీపీ ప్రభుత్వం నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడంతో విద్యార్థినులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

చోడవరంలో అద్దె భవనంలో కొనసాగుతున్న జ్యోతిబాపూలే బాలికల గురుకులం

ఆరేళ్లుగా అద్దె భవనంలోనే జ్యోతిబాపూలే బాలికల హైస్కూల్‌

గత వైసీపీ ప్రభుత్వంలో జన్నవరంలో స్థలం కేటాయింపు

నిధులు విడుదల చేయకపోవడంతో జరగని నిర్మాణాలు

పాఠశాల సమస్యపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం

చోడవరంలో భవన నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయం

హైకోర్టును ఆశ్రయించిన జన్నవరం గ్రామస్థులు

వివాదం పరిష్కారమైతే తప్పా కొలిక్కిరాని వైనం

చోడవరం, జూన్‌ 30: నియోజకవర్గ కేంద్రంలో మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల బాలికల ఉన్నత పాఠశాల ఆరేళ్లుగా అద్దె భవనంలోనే కొనసాగుతోంది. ఈ పాఠశాలకు స్థలం కేటాయించిన గత వైసీపీ ప్రభుత్వం నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడంతో విద్యార్థినులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అరకొర వసతులతో అసౌకర్యాల నడుమ విద్యార్థినులు చదువు కొనసాగిస్తున్నారు. దీనికి తోడు ఈ పాఠశాల భవనాలను జన్నవరంలోనే నిర్మించాలని ఆ గ్రామస్థులు కోర్టును ఆశ్రయించడంతో సమస్య జఠిలమైంది.

మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల బాలికల ఉన్నత పాఠశాలను 2019 సెప్టెంబరులో స్థానిక కో- ఆపరేటివ్‌ కాలనీలో ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో దీనిని ఏర్పాటు చేసి ఏడాదిలోపే సొంత భవనాలు సమకూరుస్తామని ఆర్భాటంగా ప్రకటించింది. అయితే అప్పటి నుంచి మూడు అంతస్థుల అద్దె భవనంలో ఈ పాఠశాల కొనసాగుతోంది. ఒక అంతస్థులో వంట గది, భోజనాల నిర్వహణ కొనసాగుతుండగా, రెండు, మూడు ఫ్లోర్లలో విద్యార్థినుల తరగతి గ దులు, డార్మెటరీ ఉన్నాయి. సరైన వసతి లేకపోవడంతో 240 మంది విద్యార్థినులు అసౌకర్యాల నడుమ సర్దుకుపోతున్నారు.

నిధులు విడుదలకాక ఇక్కట్లు

జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకులానికి మండలంలోని జన్నవరం పంచాయతీ పరిధిలో 10 ఎకరాల స్థలాన్ని గతంలో అధికారులు ఎంపిక చేశారు. ఈ స్థలాన్ని బీసీ గురుకులం సొసైటీ పేరిట బదలాయించడంలో తీవ్రమైన జాప్యం కారణంగా 2022లో అధికారులు ఈ స్థలాన్ని బీసీ వెల్ఫేర్‌ అధికారులకు అప్పగించారు. తరువాత ఈ స్థలంలో భవనాల నిర్మాణానికి రూ.35 కోట్లు విడుదల చేస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్థలం అప్పగింత పూర్తికావడం, నిధులు కూడా మంజూరుకావడంతో ఇక భవనాల నిర్మాణం ప్రారంభమవుతుందని అందరూ భావించారు. అయితే ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల కాకపోవడంతో ఈ భవనాల నిర్మాణం ఆగిపోయింది. అప్పటి నుంచి ఈ స్కూల్‌ అద్దె భవనంలోనే కొనసాగుతోంది. ఏడాదికి భవనానికి అద్దె రూపంలో సుమారుగా రూ.7 లక్షలు చెల్లిస్తున్నారు.

వివాదంలో పాఠశాల స్థలం

కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పాఠశాల భవనాల నిర్మాణంపై దృష్టి పెట్టింది. అయితే పాఠశాలకు జన్నవరంలో కేటాయించిన స్థలంలో కాకుండా చోడవరంలోనే భవనాలు నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే భావించారు. ఈ మేరకు స్థలాన్ని సమకూర్చాలని నిర్ణయించారు. ఈ విషయం తెలిసి జన్నవరం గ్రామస్థులు తమ గ్రామంలోనే పాఠశాల భవనాలు నిర్మించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ప్రతివాదులుగా బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులను, ప్రభుత్వాన్ని కూడా చేర్చడంతో, ఈ హైస్కూల్‌ను ఎక్కడ నిర్మించాలనే నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై పడింది. కోర్టులో ఈ వివాదం తేలి, ప్రభుత్వం నిర్ణయం తీసుకుని నిధులు విడుదల చేస్తే తప్పా విద్యార్థినుల కష్టాలు తీరే దారి కనిపించడం లేదు.

Updated Date - Jul 01 , 2025 | 12:22 AM