ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఏకలవ్య అందుబాటులోకి వచ్చేదెన్నడో?

ABN, Publish Date - Jun 08 , 2025 | 11:16 PM

అరకు ఏకలవ్య మోడల్‌ ఆశ్రమోన్నత పాఠశాల భవన సముదాయాల నిర్మాణాలు పూర్తి కావడంతో గత అక్టోబరు 2న ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో అరకులోయలోని యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్న ఈ పాఠశాల విద్యార్థులు తమ కష్టాలు తీరతాయని భావించారు.

ప్రధాని మోదీ అక్టోబరు 2న వర్చువల్‌గా ప్రారంభించినా అందుబాటులోకి రాని అరకులోయ ఏకలవ్య మోడల్‌ ఆశ్రమోన్నత పాఠశాల

గత ఏడాది అక్టోబరు 2న పాఠశాలను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

అంచనా వ్యయం కంటే ఎక్కువ ఖర్చయిన రూ.2 కోట్లు చెల్లించాలని కాంట్రాక్టర్‌ డిమాండ్‌

బిల్లులు రాకపోవడంతో భవనాలను అప్పగించని వైనం

ఈ విద్యా సంవత్సరంలోనైనా అందుబాటులోకి వస్తుందని విద్యార్థులు పెట్టుకున్న ఆశలు ఆవిరి

అరకులోయ, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): అరకు ఏకలవ్య మోడల్‌ ఆశ్రమోన్నత పాఠశాల భవన సముదాయాల నిర్మాణాలు పూర్తి కావడంతో గత అక్టోబరు 2న ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో అరకులోయలోని యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్న ఈ పాఠశాల విద్యార్థులు తమ కష్టాలు తీరతాయని భావించారు. అయితే అంచనా వ్యయం కంటే ఎక్కువగా రూ.2 కోట్లు ఖర్చయిందని, ఆ బిల్లులు చెల్లించాలని అధికారులను కాంట్రాక్టర్‌ కోరారు. అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో ఆ భవన సముదాయాలను ఇప్పటి వరకు కాంట్రాక్టర్‌ అప్పగించలేదు. ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు అరకొర వసతుల మధ్య అరకు యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో చదువుతున్నారు. పాఠశాల కొత్త భవన సముదాయాలు అందుబాటులోకి వస్తే తమ కష్టాలు తీరతాయని భావించినా వారి ఆశలు అడియాశలయ్యాయి. బిల్లుల సమస్య ఉన్నప్పుడు ప్రధాని మోదీతో ఈ పాఠశాలను ఎలా ప్రారంభిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అరకు ఎంపీ, కలెక్టర్‌, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించి, ఈ విద్యా సంవత్సరంలోనైనా విద్యార్థులకు ఈ పాఠశాలను అందుబాటులోకి తేవాలని వారు కోరుతున్నారు.

Updated Date - Jun 08 , 2025 | 11:16 PM