జిల్లాను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దుతా
ABN, Publish Date - Jul 05 , 2025 | 12:43 AM
విప్లవ వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు సమాధులున్న పార్కును కలుపుతూ అనకాపల్లి జిల్లాను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా శుక్రవారం గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలోని అల్లూరిపార్కులో అల్లూరి, గంటందొర సమాధులు, విగ్రహాలకు శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, మంత్రులు కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, ఎంపీలు సీఎం రమేష్, కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, టీడీపీ, జనసేన నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అంతుకుముందు రామాలయం నుంచి అల్లూరి పార్కు వరకు కాగడాలతో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు.
పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్
కృష్ణాదేవిపేటలో ఘనంగా అల్లూరి జయంతి
పార్కు అభివృద్ధికి హోం మంత్రి రూ.5 లక్షల విరాళం
రూ.30 లక్షల ఎంపీ ల్యాడ్స్ ప్రకటించిన సీఎం రమేశ్
అభివృద్ధి పనులకు మరిన్ని నిధులు సేకరిస్తానని హామీ
కృష్ణాదేవిపేట, జూలై 4 (ఆంధ్రజ్యోతి):
విప్లవ వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు సమాధులున్న పార్కును కలుపుతూ అనకాపల్లి జిల్లాను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా శుక్రవారం గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలోని అల్లూరిపార్కులో అల్లూరి, గంటందొర సమాధులు, విగ్రహాలకు శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, మంత్రులు కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, ఎంపీలు సీఎం రమేష్, కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, టీడీపీ, జనసేన నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అంతుకుముందు రామాలయం నుంచి అల్లూరి పార్కు వరకు కాగడాలతో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు, దేశ స్వాతంత్య్రం కోసం గిరిజన ప్రాంతంలో మహోద్యమం నడిపి, వీరోచిత పోరాటం చేసిన అల్లూరి అందరికీ ఆదర్శమన్నారు. ఈ స్ఫూర్తితో యువత సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు. అల్లూరిపార్కుతో సహా అల్లూరి అశువులు బాసిన ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, అనకాపల్లి జిల్లాను టూరిజం సర్క్యూట్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు. ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఉద్యమాలకు స్ఫూర్తి అల్లూరికి నివాళులర్పించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. గంజాయి రవాణా చేసి పట్టుబడిన వారికి ప్రభుత్వ పథకాలను రద్దుచేసే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన అల్లూరి స్ఫూర్తితో గంజాయి నిర్మూలనకు పోరాడాలని పిలుపునిచ్చారు. పార్కులో ఏర్పాటుచేయనున్న సోలార్‌పవర్ లేదా జిమ్ ఏర్పాటుకు రూ.5 లక్షలు విరాళంగా అందిస్తానని ప్రకటించారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పార్కు అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.30లక్షలు ప్రకటించారు. మరిన్ని శ్వాశత కట్టడాల కోసం వివిధ కంపెనీల ప్రతినిధులు, స్నేహితుల ద్వారా నిధులు సమకూరుస్తానని హామీ ఇచ్చారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ పార్కు అభివృద్ధికి రూ.10లక్షలు విరాళమిచ్చి భాగస్థుడిని కావడం ఆనందంగా ఉందన్నారు. కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ అల్లూరి స్ఫూర్తితో తల్లిదండ్రులు పిల్లల పెంపకంపై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వం మార్గదర్శి కార్యక్రమం ద్వారా పిల్లలను దత్తత తీసుకునే కార్యక్రమం చేపట్టిందని, దానిని విజయవంతం చేయాలన్నారు. పార్కు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ముందుకు రావడం అభినందనీయమని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. అల్లూరి జయంతి సందర్భంగా కొయ్యూరులో నిర్వహించిన జిల్లాస్థాయి వాలీబాల్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన కశింకోట జట్టుకు రూ.50వేలు, ద్వితీయస్థానంలో నిలిచిన కొయ్యూరు జట్టుకు రూ.30 వేలు మంత్రులు, ఎంపీలు, స్పీకర్ చేతులమీదుగా బహూకరించారు. అల్లూరి వ్యాసరచనన విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో తుని మాజీ ఎంపీ అశోక్‌బాబు, టీడీపీ జిల్లా అఽధ్యక్షుడు బత్తుల తాతబ్బాయి, జనసేన నేత రాజాన సూర్యచంద్ర, ఎస్పీ తుహిన్‌సిన్హా, టీడీపీ నేతలు అడిగర్ల అప్పలనాయుడు, చిటికెల తారకవేణుగోపాల్, పర్యాటక శాఖాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 05 , 2025 | 12:43 AM