ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హైడ్రో ప్రాజెక్టును అడ్డుకుంటాం

ABN, Publish Date - Jul 24 , 2025 | 11:25 PM

మండలంలోని పెదకోట పంచాయతీ రేగులపాలెం వద్ద హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రకటించారు. రేగులపాలెం వద్ద గురువారం హైడ్రో పవర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జడ్పీటీసీ సభ్యుడు దీసరి గంగరాజు ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు.

హైడ్రో పవర్‌ ప్రాజెక్టును అడ్డుకుంటామంటూ విల్లు ఎక్కుపెట్టిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, ఇతర నాయకులు

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

అనంతగిరి, జూలై 24(ఆంధ్రజ్యోతి): మండలంలోని పెదకోట పంచాయతీ రేగులపాలెం వద్ద హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రకటించారు. రేగులపాలెం వద్ద గురువారం హైడ్రో పవర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జడ్పీటీసీ సభ్యుడు దీసరి గంగరాజు ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు తముటు, చింతలపాలెం, కొండిబకోట, రేగులపాలెం గిరిజనులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ గిరిజన సలహా మండలిలో హైడ్రో పవర్‌ ప్రాజెక్టును రద్దు చేస్తూ తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. గిరిజనుల ఉనికి మీద దెబ్బకొట్టేందుకు పెద్ద కుట్రలే జరుగుతున్నాయని, ప్రాజెక్టును అడ్డుకుంటామన్నారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్టు కారణంగా తముటు, చింతలపాలెం, రేగులపాలెం, కొండిబకోట గ్రామాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. గిరిజన ప్రాంతం హక్కులు, చట్టాలను తుంగలో తొక్కి కార్పొరేట్‌ కంపెనీల పెత్తనమేమిటని ప్రశ్నించారు. ప్రాజెక్టులకు అనుకూలంగా ఇచ్చిన జీవో నంబర్‌ 51ను రద్దు చేసి, గిరిజనుల పక్షాన పాలకులు నిలబడాలని డిమాండ్‌ చేశారు. అనంతరం రేగులపాలెం సమీపంలోని గెడ్డ వద్దకు వెళ్లి బాణం, విల్లు ఎక్కిపెట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కిల్లో సురేంద్ర, జిల్లా కార్యదర్శి అప్పలనర్స, జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు, నాయకులు వెంకన్న, ఉమామహేశ్వరావు, సర్పంచ్‌ అన్నపూర్ణ, ఎంపీటీసీ సభ్యురాలు శ్రావణి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2025 | 11:25 PM