ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

దోమలపై యుద్ధం

ABN, Publish Date - May 16 , 2025 | 12:32 AM

గిరిజన ప్రాంతం భౌళికంగా ఎత్తులో ఉండడంతో పాటు పచ్చదనం అధికంగా ఉండడంతో దోమల వ్యాప్తికి అనుకూలమైన ప్రదేశంగా మారింది. దీంతో మలేరియా కారక దోమల వ్యాప్తి సైతం అధికంగానే ఉంటుంది. ప్రత్యేకంగా దోమల వ్యాప్తిని అరికట్టి, మలేరియాను నియంత్రించేందుకు అధికార యంత్రాంగం పలు చర్యలు కొనసాగిస్తున్నది.

చింతపల్లి మండలం లంబసింగి పీహెచ్‌సీ పరిధి నిమ్మలపాలెంలో జరుగుతున్న స్ర్పేయింగ్‌

జిల్లాలో ముమ్మరంగా దోమల మందు పిచికారీ

- పాడేరు, రంపచోడవరం, చింతూరు డివిజన్లలో 2,086 పల్లెల్లో స్ర్పేయింగ్‌ లక్ష్యం

- ప్రస్తుతానికి 1,102 గ్రామాల్లో పూర్తి

- గతేడాది కంటే ఈ ఏడాది పెరిగిన మలేరియా కేసులు

- నియంత్రణకు అధికారుల చర్యలు

- మరింత సమర్థవంతంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని పలువురి అభిప్రాయం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

గిరిజన ప్రాంతం భౌళికంగా ఎత్తులో ఉండడంతో పాటు పచ్చదనం అధికంగా ఉండడంతో దోమల వ్యాప్తికి అనుకూలమైన ప్రదేశంగా మారింది. దీంతో మలేరియా కారక దోమల వ్యాప్తి సైతం అధికంగానే ఉంటుంది. ప్రత్యేకంగా దోమల వ్యాప్తిని అరికట్టి, మలేరియాను నియంత్రించేందుకు అధికార యంత్రాంగం పలు చర్యలు కొనసాగిస్తున్నది. దోమల మందు స్ర్పేయింగ్‌, దోమల ఉత్పత్తికి అవకాశం లేకుండా నీటి నిల్వలను ధ్వంసం చేయడం, జ్వర బాధితులకు మలేరియా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులిచ్చి చికిత్సలు చేస్తున్నారు. జిల్లాలో మలేరియా కారక దోమల వ్యాప్తిని అరికట్టే మందు స్ర్పేయింగ్‌ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రతి ఏడాది ఎంపిక చేసిన గ్రామాల్లో మలేరియా మందు స్ర్పేయింగ్‌ రెండు విడతలుగా చేపడతారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జిల్లాలో ఎంపిక చేసిన 2,086 గ్రామాల్లో స్ర్పేయింగ్‌ పనులు చేపట్టేందుకు గత ఏప్రిల్‌ నెల 15న పనులను పాడేరులో కలెకర్‌్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుతం ఆయా పనులు జోరుగా సాగుతున్నాయి.

జిల్లాలోని 2,086 గ్రామాల్లో స్ర్పేయింగ్‌ లక్ష్యం

గతంలో గిరిజన పల్లెల్లో నమోదైన మలేరియా కేసుల ఆధారంగా స్ర్పేయింగ్‌ పనులకు ఆయా గ్రామాలను ఎంపిక చేస్తారు. అలాగే ఈ ఏడాది జిల్లాలో 2,086 గ్రామాలను మలేరియా మందు స్ర్పేయింగ్‌ చేసేందుకు ఎంపిక చేశారు. ఏప్రిల్‌ 15న మొదలైన తొలి విడత స్ర్పేయింగ్‌ జూన్‌ 15 నాటికి ముగుస్తుంది. అలాగే రెండో విడత స్ర్పేయింగ్‌ జూలై 1 మొదలై సెప్టెంబరు 15 నాటికి ముగుస్తుంది. ప్రస్తుతం(మే 13 నాటికి) తొలి విడతలో భాగంగా 1,102 గ్రామాల్లో స్ర్పేయింగ్‌ పూర్తికాగా, మిలిగిన 984 గ్రామాల్లోనూ గడువుకు ముందే స్ర్పేయింగ్‌ పనులు పూర్తవుతాయని మలేరియా విభాగం అధికారులు అంటున్నారు.

ఈ ఏడాది పెరిగిన మలేరియా కేసులు

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మలేరియా కేసులు పెరుగుదల కనిపిస్తున్నది. గతేడాది జనవరి నుంచి మే 11 నాటికి 695 మలేరియా కేసులు నమోదుకాగా, అదే సమయానికి ఈ ఏడాది 902 కేసులు నమోదయ్యాయి. అంటే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో కేవలం ఐదు నెలల్లో 207 కేసులు పెరిగినట్టు అధికారులు తెలిపారు. దీంతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమై మలేరియా నియంత్రణకు అవసరమైన స్ర్పేయింగ్‌తో పాటు ప్రతి శుక్రవారం డ్రై డేగా ప్రకటించి దోమల ఉత్పత్తికి ఆస్కారం లేకుండా గ్రామాల్లో నీటి నిల్వలను ధ్వంసం చేయడం, క్షేత్ర స్థాయిలో పారామెడికల్‌ సిబ్బంది, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు సైతం మలేరియా నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు. అయితే మలేరియా నియంత్రణ కేవలం మలేరియా విభాగం, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందే బాధ్యత అన్నట్టు కాకుండా... గ్రామ స్థాయిలో ఉండే పంచాయతీ కార్యదర్శి, గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామీణ నీటి సరఫరా విభాగం సిబ్బంది, స్వయం సహాయక సంఘాలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం అవసరం. అందుకు గానూ జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా చర్యలు చేపట్టేందుకు మరింత జోరుగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత పకడ్బందీగా నిర్వహించాలంటే..

- పాడేరు ఏజెన్సీ ప్రాంతానికి ప్రత్యేకంగా జిల్లా మలేరియా నివారణ అధికారిని నియమించాలి. రంపచోడవరం, చింతూరు డివిజన్లకు కలిపి మరొక డీఎంవోను నియమించాలి.

- దోమల నివారణకు ఉపయోగించే మందును ప్రతి ఏడాది మార్చి నెలలోనే ఉన్నతాధికారులు సమకూర్చాలి.

- ప్రతి ఏడాది ఏప్రిల్‌ రెండో వారం నుంచే దోమల నివారణ మందును పిచికారీ చేయాలి.

- దోమల ఉత్పత్తి పెరగకుండా దోమల గుడ్లను లార్వా దశలోనే నాశనం చేసే యాంటీ లార్వా ఆపరేషన్‌ ప్రక్రియను సక్రమంగా చేపట్టాలి.

- మొక్కుబడిగా కాకుండా ప్రతి పల్లెలోనూ దోమల నివారణ మందు పిచికారీ చేయాలి.

- స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను పిచికారీ పనుల్లో భాగస్వాములను చేయాలి.

- మలేరియా నివారణకు చేపట్టే చర్యల్లో పక్కాగా సహకరించాలని వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయాలి.

- ఏజెన్సీలో మలేరియా వ్యాప్తి, మరణాలపై వాస్తవాలను అధికారులు గ్రహించాలి. తప్పుడు లెక్కలు, మరణాలపై అవాస్త ప్రకటనలు వంటి చర్యల వల్ల మలేరియా నివారణ చర్యలకు విఘాతం కలుగుతుందని అధికారులు గుర్తించాలి.

- గిరిజనులకు జ్వరం వచ్చిన వెంటనే మలేరియా పరీక్ష, ఇతర వైద్య సేవలు అందుబాటులో ఉంచాలి.

.

జిల్లాలో మలేరియా మందు స్పేయింగ్‌ పనుల వివరాలు

డివిజన్‌ గ్రామాల లక్ష్యం లక్ష్యం జనాభా స్ర్పేయింగైన గ్రామాలు జనాభా

-------------------------------------------------------------------------------------------------------------

పాడేరు 1,503 3,31,067 693 1,50,573

రంపచోడవరం 391 1,32,846 293 86,872

చింతూరు 192 56,973 116 42,714

------------------------------------------------------------------------------------------------------------

మొత్తం 2,086 5,20,886 1,102 2,80,159

------------------------------------------------------------------------------------------------------------

Updated Date - May 16 , 2025 | 12:32 AM