ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విశాఖకు విశ్వఖ్యాతి

ABN, Publish Date - Jun 22 , 2025 | 01:05 AM

విశాఖపట్నం చరిత్రలో ‘యోగాంధ్ర’ ఓ సువర్ణ అధ్యాయం. మరిచిపోలేని ఘట్టం.

  • అద్భుతంగా యోగాంధ్ర కార్యక్రమం

  • జనసంద్రమైన సాగరతీరం

  • స్వచ్ఛందంగా తరలివచ్చిన వైనం

  • గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదు

  • సమష్టి కృషికి సంకేతం

విశాఖపట్నం, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం చరిత్రలో ‘యోగాంధ్ర’ ఓ సువర్ణ అధ్యాయం. మరిచిపోలేని ఘట్టం. విశాఖ నుంచి భీమిలి వరకూ సాగరతీరం శనివారం సూర్యోదయానికి ముందే జనసంద్రంగా మారిపోయింది. ఒక పద్ధతి ప్రకారం అంతా గంటసేపు యోగాసనాలు వేసి విశాఖను గిన్నిస్‌ రికార్డులోకి ఎక్కించారు. దాదాపు మూడు లక్షల మంది ప్రజలు తరలివచ్చి స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాధారణంగా ఎవరైనా తెల్లవారు జామున రెండు గంటలకు లేచి ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లాలంటే...ఎందుకు వచ్చిన తిప్పలు అని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తారు. కానీ నగర ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కలిగిన పెద్దలు, పిల్లలు, విద్యార్థులు, యువత ప్రత్యేక ఆసక్తితో బీచ్‌కు స్వచ్ఛందంగా తరలివచ్చారు. కార్యక్రమం చివరి వరకు ఉండి వెళ్లారు. యోగాతో జీవనశైలి మార్చుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయనే విశ్వాసం ప్రతి ఒక్కరిలో కలిగింది. ఇది నిజంగానే ఒక ప్రజా ఉద్యమంలా అందరికీ చేరువైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, పోలీసులు అందరూ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గిరిజన విద్యార్థులు తమ వంతు సహకారం అందించారు.

ప్రజా సహకారంతోనే విజయవంతం

మంచి కార్యక్రమంలో ఇదో ముందడుగు

యోగా రికార్డుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హర్షం

వేడుకల అనంతరం కలెక్టరేట్‌లో మంత్రులు, అధికారులతో సమీక్ష

మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, అధికారులకు ప్రశంసలు

విశాఖపట్నం, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి):

లక్షలాది మందితో యోగా నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తంచేశారు. శనివారం ఉదయం యోగా వేడుకల అనంతరం కలెక్టరేట్‌లో మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశ మందిరంలోకి ఆయన రాగానే మంత్రులు, అధికారులు కరతాళధ్వనులతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన వివిధ అంశాలపై మాట్లాడుతూ వేడుకలను విజయవంతంగా నిర్వహించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. విశాఖతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరిగిన యోగా వేడుకలపై సమావేశంలో చర్చించారు. ప్రపంచ రికార్డులు సాధించడం పట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగులను సీఎం అభినందించారు. ప్రజా సహకారం, భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించగలిగినట్టు తెలిపారు. మంచి కార్యక్రమంలో ఇదో ముందడుగని ఆయన అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకుని పనిచేసిన తీరుకు అభినందనలు తెలిపారు. అర్ధరాత్రి రెండు గంటల నుంచే ప్రజలు యోగా చేసే కంపార్ట్‌మెంట్ల వద్దకు తరలిరావడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. మూడు లక్షల మందికిపైగా యోగా సాధనలో పాల్గొనడం గొప్ప విషయంగా పేర్కొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారి లెక్కింపులో క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ విధానం తిరుగులేని ఫలితాన్ని ఇచ్చిందన్నారు. సమీక్ష సమావేశంలో స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మంత్రులు నారా లోకేశ్‌, కింజరాపు అచ్చెన్నాయుడు, పి.నారాయణ, వంగలపూడి అనిత, డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, గుమ్మడి సంధ్యారాణి, కందుల దుర్గేష్‌, కొండపల్లి శ్రీనివాస్‌, అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌కు సీఎం అభినందనలు

యోగాంధ్రను విజయవంతంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించిన జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా అభినందించారు. వేడుకల నిర్వహణకు చేసిన కృషిని ప్రశంసించారు. యోగా వేడుకల అనంతరం కలెక్టరేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి కార్యక్రమ నిర్వహణలో అధికార యంత్రాంగం కీలకపాత్ర పోషించిందన్నారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్‌ శక్తివంచన లేకుండా కృషిచేశారని కితాబిచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమ న్వయంతో పనిచేయడం వల్లే భారీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేయగలిగినట్టు సీఎం వెల్లడించారు.

అపూర్వఘట్టం

- ఎం.శ్రీభరత్‌, విశాఖ ఎంపీ

నగరంలో నిర్వహించిన యోగాంధ్ర చారిత్రాత్మక విజయం నమోదుచేసిందని విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్‌ అన్నారు. కార్యక్రమం విజయవంతం చేసిన నాయకులు, అధికారులు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సముద్రతీరంలో 3.03 లక్షల మంది ఒకేసారి యోగా సాధన చేయడం చరిత్రలోనే అపూర్వఘట్టంగా అభివర్ణించారు.

అందరి సాయంతో విజయవంతం

- వెలగపూడి రామకృష్ణబాబు, తూర్పు ఎమ్మెల్యే

నగరంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం అందరి సాయంతో విజయవంతమైందని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. నెలరోజులుగా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయడం, క్షేత్రస్థాయిలో నాయకులతో ప్రతిరోజూ మాట్లాడడంతో అంచనాలకు మించి జనాలు హాజరయ్యారన్నారు. యోగాంధ్రతో విశాఖ సత్తా మరోసారి రుజువైందని, అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Jun 22 , 2025 | 01:06 AM