ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పల్లె పండగ బకాయిలు రూ.20 కోట్లు

ABN, Publish Date - May 06 , 2025 | 01:20 AM

‘పల్లె పండగ’ కార్యక్రమం కింద గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఆరు నెలల నుంచి బిల్లులు మంజూరు కావడం లేదు. దీంతో ఆయా పనులు చేసిన కాంట్రాక్టర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పూర్తయిన పనులకు సంబంధించి సుమారు 20 కోట్ల రూపాయల మేర బిల్లులు పెండింగ్‌లో వున్నాయని అధికారులు చెబుతున్నారు.

గొలుగొండ మండలం పాతమల్లంపేట నుంచి అంటిమానిజోర్లుకి వేసిన సీసీ రోడ్డు

ఆరు నెలల నుంచి విడదల కాని బిల్లులు

నర్సీపట్నం నియోజకవర్గంలో రూ.42 కోట్లతో 521 పనులు మంజూరు

రూ.27.36 కోట్ల విలువైన 452 పనులు పూర్తి

బిల్లుల కోసం నిరీక్షిస్తున్న కాంట్రాక్టర్లు

నర్సీపట్నం, మే 5 (ఆంధ్రజ్యోతి): ‘పల్లె పండగ’ కార్యక్రమం కింద గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఆరు నెలల నుంచి బిల్లులు మంజూరు కావడం లేదు. దీంతో ఆయా పనులు చేసిన కాంట్రాక్టర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పూర్తయిన పనులకు సంబంధించి సుమారు 20 కోట్ల రూపాయల మేర బిల్లులు పెండింగ్‌లో వున్నాయని అధికారులు చెబుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు గత ఏడాది అక్టోబరు 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహించారు. ఉపాధి హామీ పథకం కన్వర్జెన్సీ నిధులతో అన్ని గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, రహదారులకు మరమ్మతు వంటి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు సత్వరమే బిల్లుల చెల్లింపు జరుగుతుందని అధికారులు చెప్పారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో రూ.42.29 కోట్లతో 521 పనులు చేయాలని నిర్ణయించారు. ఏ పని కూడా రూ.10 లక్షలకు మించకపోవడంతో నామినేటెడ్‌ విధానంలో కాంట్రాక్టర్లకు అప్పగించారు. వివిధ కారణాల వల్ల 18 పనులు ఇంకా మొదలు పెట్టలేదు. రూ.27.36 కోట్ల విలువ చేసే 452 పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం రూ.12 కోట్లు విలువైన 51 పనులు జరుగుతున్నాయి. అయితే పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు గత ఏడాది నవంబరు చివరి వారం, డిసెంబరు మొదటి వారంలో స్పల్పంగా బిల్లులు మంజూరయ్యాయి. ఆ తరువాత నుంచి ఇంతవరకు బిల్లులు మంజూరు కాలేదు. దీనిపై పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం డీఈ ఈశ్వరరావును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. ‘పల్లె పండుగ’ పనుల బిల్లులు ఈ నెలాఖరులోగా మంజూరవుతాయని చెప్పారు.

మండలాల వారీగా చేపట్టిన పనులు,

నర్సీపట్నం మండలంలో రూ.5 కోట్ల విలువ చేసే 57 అభివృద్ధి పనులు మంజూరు కాగా రూ.3.65 కోట్లతో 48 పనులు పూర్తి చేశారు. రూ.1.48 కోట్లతో తొమ్మిది పనులు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లకు రూ.3.22 కోట్ల బిల్లులు రావాల్సి వుంది.

నాతవరం మండలంలో రూ.15 కోట్ల విలువ చేసే 167 పనులు మంజూరు కాగా రూ.9.42 కోట్లతో 142 పనులు పూర్తి చేశారు. ఇంకా రూ.4.82 కోట్ల విలువ చేసే 22 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. రూ.79 లక్షల విలువైన మూడు పనులు మొదలు పెట్టలేదు. కాంట్రాక్టర్లకు రూ.6.26 కోట్ల మేర బకాయిలు వున్నాయి..

గొలుగొండ మండలంలో రూ.9.72 కోట్ల విలువైన 170 పనులు మంజూరయ్యాయి. రూ.6.25 కోట్లతో 156 పనులు పూర్తి చేశారు. రూ.2.44 కోట్ల విలువైన ఎనిమిది పనులు జరుగుతున్నాయి. రూ.కోటి విలువైన ఆరు పనులు మొదలు కాలేదు. కాంట్రాక్టర్లకు రూ.4.85 కోట్లమేర బిల్లులు పెండింగ్‌లో వున్నాయి.

మాకవరపాలెం మండలంలో రూ.12.41 కోట్లతో 127 అభివృద్ధి పనులు మంజూరయ్యాయి. రూ.8 కోట్లతో 106 పనులు పూర్తి చేశారు. రూ.3.61 కోట్ల విలువ చేసే 12 పనులు కొనసాగుతున్నాయి. రూ.75 లక్షల విలువ చేసే తొమ్మిది పనులు మొదలు కాలేదు. కాంట్రాక్టర్లకు సుమారు రూ.6 కోట్ల వరకు బకాయిలు వున్నాయి.

Updated Date - May 06 , 2025 | 01:20 AM