ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పరిశ్రమల ఏర్పాటుకు సత్వర చర్యలు

ABN, Publish Date - Jul 30 , 2025 | 12:18 AM

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు ద్వారా పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి సత్వరమే అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సహక కమిటీ (డీఐఈపీసీ) 15వ జిల్లాస్థాయి సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది.

మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

పారిశ్రామిక వేత్తల దరఖాస్తులను త్వరగా ఆమోదించాలి

43 భారీ, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ప్రతిపాదనలు

రూ.2,81,760 కోట్ల పెట్టుబడులు, 1,46,673 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

డీఐఈపీసీ సమావేశంలో కలెక్టర్‌ విజయకృష్ణన్‌

అనకాపల్లి కలెక్టరేట్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు ద్వారా పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి సత్వరమే అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సహక కమిటీ (డీఐఈపీసీ) 15వ జిల్లాస్థాయి సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గత సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలను జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ పీకేపీ ప్రసాద్‌ కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ, గత మే 26న జరిగిన సమావేశం తరువాత నుంచి ఇప్పటి వరకు వివిధ శాఖల అనుమతి కోసం దరఖాస్తు 685 దరఖాస్తులు రాగా, వాటిలో 615 దరఖాస్తులను ఆమోదించామని తెలిపారు. వివిధ శాఖల అధికారులతో మాట్లాడి మిగిలిన దరఖాస్తులను త్వరగా ఆమోదించాలని అధికారులను ఆదేశించారు. 14 పరిశ్రమలకు సంబంధించిన వివిధ రాయితీల కోసం 37 దరఖాస్తులు రాగా, రూ.5.92 కోట్ల విడుదలకు కమిటీ సమావేశంలో ఆమోదం తెలిపామన్నారు. జిల్లాలో 43 భారీ, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు ప్రతిపాదనలు వివిధ దశల్లో వున్నాయని, వీటి ద్వారా రూ.2,81,760 కోట్ల పెట్టుబడులు, 1,46,673 మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే అవకాశాలు వున్నాయన్నారు.

ఈ సందర్భంగా పరిశ్రమల్లో తనిఖీలపై సమీక్ష నిర్వహించారు. 2024 అక్టోబరు ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు మొత్తం 196 పరిశ్రమలకుగాను 176 పరిశ్రమల్లో తనిఖీలు జరిగాయని, వివిధ శాఖల అధికారులు పాల్గొని ఆయా పరిశ్రమల పనితీరు మెరుగుదలకు 485 సూచనలు ఇచ్చినట్టు ఆమె తెలిపారు. సమావేశంలో ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ ఎం.నరసింహారావు, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ ముకుందరావు, జిల్లా రిజిస్ట్రార్‌ మన్మథరావు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఆర్‌.వెంకటరమణ, కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2025 | 12:18 AM