వైసీపీలో కలకలం
ABN, Publish Date - Jul 11 , 2025 | 01:25 AM
జిల్లా పరిషత్ వ్యవహారం వైసీపీలో కలకలం రేపింది. చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్రపై అసంతృప్తితో ఉన్న 22 మంది సభ్యులు బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో జడ్పీ చైర్‌పర్సన్, సభ్యుల మధ్య రాజీ కుదర్చాలన్న అధిష్ఠానం ఆదేశాలతో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు బీచ్‌రోడ్డులోని ఆయన కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశానికి పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి కురసాల కన్నబాబు, ఉమ్మడి జిల్లాలోని ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు హాజరవుతున్నారు. ఈ సమావేశానికి విధిగా రావాలని జడ్పీటీసీ సభ్యులందరికీ గురువారం సమాచారం అందించారు.
చైర్‌పర్సన్, జడ్పీటీసీ సభ్యుల మధ్య విభేదాలపై అధిష్ఠానం ఆరా
సభ్యులకు నేతల ఫోన్లు
నేడు బొత్స సమక్షంలో పంచాయితీ
అందరూ హాజరుకావలసిందిగా ఆదేశాలు
విశాఖపట్నం, జూలై 10 (ఆంధ్రజ్యోతి):
జిల్లా పరిషత్ వ్యవహారం వైసీపీలో కలకలం రేపింది. చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్రపై అసంతృప్తితో ఉన్న 22 మంది సభ్యులు బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో జడ్పీ చైర్‌పర్సన్, సభ్యుల మధ్య రాజీ కుదర్చాలన్న అధిష్ఠానం ఆదేశాలతో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు బీచ్‌రోడ్డులోని ఆయన కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశానికి పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి కురసాల కన్నబాబు, ఉమ్మడి జిల్లాలోని ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు హాజరవుతున్నారు. ఈ సమావేశానికి విధిగా రావాలని జడ్పీటీసీ సభ్యులందరికీ గురువారం సమాచారం అందించారు.
ఇదిలావుండగా బుధవారం జడ్పీ సర్వసభ్య సమావేశానికి మెజారిటీ సభ్యులు రాకపోవడం, రెండు రోజుల క్రితం అనకాపల్లిలో రహస్య సమావేశం నిర్వహించడంపై ‘జడ్పీ చైర్‌పర్సన్‌కు షాక్’ శీర్షికతో గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. కొందరు ‘ఆంధ్రజ్యోతి’లో కథనం క్లిప్పింగ్‌ను అధిష్ఠానానికి పంపించారు. దీంతో విశాఖలో ఏమి జరుగుతందని జడ్పీటీసీ సభ్యులకు నేతలు ఫోన్ చేసి ఆరా తీశారు. జడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర వ్యవహారశైలిపై కొందరు ఫిర్యాదులు చేశారు. జడ్పీటీసీ సభ్యులే కాదు...ఉమ్మడి జిల్లాలో చాలామంది నేతలు చైర్‌పర్సన్‌ను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. మరో ఏడాది మూడు నెలలు మాత్రమే తమ పదవీకాలం ఉందని, అయినా జడ్పీటీసీ సభ్యులుగా ఏమి సాధించలేకపోయామని వాపోయారు. ఇదే విషయం శుక్రవారం సమావేశంలో చెప్పాలని సభ్యులు నిర్ణయించుకున్నారు. కాగా జడ్పీ చైర్‌పర్సన్ తరపున కొందరు రంగంలోకి దిగి సభ్యులకు ఫోన్ చేసి వివాదాలు ఎందుకు?..కలిసి కూర్చుని మాట్లాడుకుందామని కోరినట్టు ప్రచారం సాగుతుంది.
Updated Date - Jul 11 , 2025 | 01:25 AM