ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

17న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పర్యటన

ABN, Publish Date - Jul 16 , 2025 | 01:19 AM

కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ నెల 17వ తేదీన విశాఖపట్నం వస్తున్నారు.

విశాఖపట్నం, జూలై 15 (ఆంధ్రజ్యోతి):

కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ నెల 17వ తేదీన విశాఖపట్నం వస్తున్నారు. ఆ రోజు రాత్రికి ఇక్కడే బస చేసి మరుసటిరోజు ఉదయం నేవల్‌ డాక్‌యార్డులో కొత్త నౌక ఐఎన్‌ఎస్‌ నిస్తార్‌ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ముగించుకొని ఢిల్లీ వెళతారు.

నేడు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాక

మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు బుధవారం విశాఖపట్నం వస్తున్నారు. బుధవారం ఉదయం ఆయన కిర్లంపూడి లేఅవుట్‌లోని ఇంద్రప్రస్థ నివాసానికి చేరుకుంటారు. 11.20 గంటలకు వాల్తేరు క్లబ్‌కు వెళ్లి అక్కడ దివంగత వేగేశ్న ఆనందరాజుకు నివాళులు అర్పిస్తారు. 20వ తేదీ వరకూ నగరంలోనే ఉంటారు.

ఇస్రో చైర్మన్‌కు ఘన స్వాగతం

గోపాలపట్నం, జూలై 15 (ఆంధ్రజ్యోతి):

శాస్త్రవేత్తల సదస్సులో పాల్గొనడానికి ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ మంగళవారం రాత్రి 7.30 గంటలకు నగరానికి చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో పలువురు శాస్త్రవేత్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన నగరానికి బయలుదేరి వెళ్లారు.

Updated Date - Jul 16 , 2025 | 01:19 AM