ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం

ABN, Publish Date - Aug 02 , 2025 | 12:30 AM

జాతీయ రహదారిపై అనకాపల్లి పట్టణ శివారు కొత్తూరు జంక్షన్‌ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామునద్విచక్ర వాహనాన్ని, ఐషర్‌ వ్యాన్‌ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కు సంబంధించి ట్రాఫిక్‌ సీఐ ఎం.వెంకటనారాయణ అందించిన వివరాలిలా ఉన్నాయి.

ప్రమాదానికి కారణమైన వ్యాన్‌

మరొకరికి తీవ్ర గాయాలు

ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొన్న వ్యాన్‌

అనకాపల్లి కొత్తూరు జంక్షన్‌ వద్ద ఘటన

మృతులు సిమెంట్‌ ఫ్యాక్టరీ ఉద్యోగులు

సహచర ఉద్యోగి పెళ్లికి వెళ్లి వస్తుండగా దుర్ఘటన

ఒకరిది గొలుగొండ, మరొకరిది చినయాదగిరిపాలెం

అనకాపల్లి టౌన్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై అనకాపల్లి పట్టణ శివారు కొత్తూరు జంక్షన్‌ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామునద్విచక్ర వాహనాన్ని, ఐషర్‌ వ్యాన్‌ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కు సంబంధించి ట్రాఫిక్‌ సీఐ ఎం.వెంకటనారాయణ అందించిన వివరాలిలా ఉన్నాయి.

గొలుగొండ మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన గండెం నాగసాయి బాలాజీ (25) కశింకోట మండలంలోని ఓ సిమెంట్‌ కంపెనీలో ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. మునగపాక మండలం చినయాదగిరిపాలెం గ్రామానికి చెందిన మేడిశెట్టి వెంకట సూరిఅప్పారావు (28) ఇదే కంపెనీలో సూపర్‌వైజర్‌గా, గాజువాకకు చెందిన షైనా రవి క్రేన్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. కశింకోటలో ఒక గది అద్దెకు తీసుకుని వుంటున్నారు. గురువారం రాత్రి తాళ్లపాలెంలో సహచర ఉద్యోగి వివాహ వేడుకకు హాజరయ్యారు. తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై అనకాపల్లి వచ్చి, తిరిగి కశింకోట వెళుతున్నారు. కొత్తూరు జంక్షన్‌ సమీపంలో విశాఖ వైపు నుంచి వస్తున్న ఐషర్‌ వ్యాన్‌, ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొన్నది. తరువాత డ్రైవర్‌ వ్యాన్‌ను ఆపకుండా వెళ్లిపోయాడు. ఈ ప్రమాదంలో వెంకట సూరిఅప్పారావు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన నాగ సాయిబాలాజీ, రవిలను స్థానిక ఎన్టీఆర్‌ వైద్యాలయానికి తరలించారు. చికిత్స పొందుతూ నాగసాయి బాలాజీ మృతిచెందాడు. రవికి ప్రథమ చికిత్స చేసిన అనంతరం వైద్యుల సూచన మేరకు విశాఖలో ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

కాగా చేతికి అందివచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో నాగసాయిబాలాజీ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన ఇతను నాలుగు నెలల క్రితం సిమెంట్‌ ఫ్యాక్టరీలో చేరాడు. ఇతని తండ్రి ఈశ్వరరావు గతంలో ఎంపీటీసీ సభ్యునిగా పనిచేశారు. ఇద్దరు కుమారుల్లో పెద్దవాడైన సాయిబాలాజీ రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మరో మృతుడు వెంకటసూరిఅప్పారావు తల్లిదండ్రులు లోవరాజు, లక్ష్మి వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తున్న తరుణంలో రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో కన్నీరుమున్నీరు అయ్యారు. నాగసాయి బాలాజీ తల్లి అచ్చెయ్యమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ట్రాఫిక్‌ ఎస్‌ఐ శేఖరం తెలిపారు.

సీసీ టీవీ ఫుటేజీలతో వ్యాన్‌ గుర్తింపు

ప్రమాదానికి కారణమైన ఐషన్‌ వ్యాన్‌ను సీసీ టీవీ ఫుటేజీల ఆఽధారంగా తెలంగాణలోని మేడ్చల్‌ ప్రాంతానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. జాతీయ రహదారిపై పలుచోట్ల వున్న సీసీ కెమెరాలతోపాటు నక్కపల్లి మండలం వేంపాడు టోల్‌ ప్లాజా వద్ద వున్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి నిర్ధారణకు వచ్చారు. అన్ని జిల్లాల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎన్టీఆర్‌ జిల్లా పోలీసులు వ్యాన్‌ను అదుపులోకి తీసుకున్నారని, వాహనంతోసహా డ్రైవర్‌ను ఇక్కడకు తీసుకువచ్చేందుకు పోలీసు సిబ్బంది వెళ్లారని ఎస్‌ఐ శేఖరం తెలిపారు. మృతదేహాలకు ఎన్టీఆర్‌ వైద్యాలయంలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Updated Date - Aug 02 , 2025 | 12:30 AM