మరో ఇద్దరికి ‘మార్కెట్’ పదవులు
ABN, Publish Date - Apr 17 , 2025 | 12:49 AM
జిల్లాలో మరో రెండు వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)లకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈసారి రెండు పదవులనూ టీడీపీ నాయకులకు కట్టబెట్టింది. అనకాపల్లి ఏఎంసీ (ఎన్టీఆర్ మార్కెట్ యార్డు) చైర్మన్‌గా అనకాపల్లి మండలం కూండ్రం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత పచ్చికూర రాము, మాడుగుల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా మాడుగుల గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు పుప్పాల అప్పలరాజు నియమితులయ్యారు.
అనకాపల్లి ఏఎంసీ చైర్మన్‌గా పచ్చికూర రాము
మాడుగులకు పుప్పాల అప్పలరాజు
విధేయతకు పట్టంకట్టిన టీడీపీ అధిష్ఠానం
అనకాపల్లి టౌన్/ మాడుగుల, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో రెండు వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)లకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈసారి రెండు పదవులనూ టీడీపీ నాయకులకు కట్టబెట్టింది. అనకాపల్లి ఏఎంసీ (ఎన్టీఆర్ మార్కెట్ యార్డు) చైర్మన్‌గా అనకాపల్లి మండలం కూండ్రం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత పచ్చికూర రాము, మాడుగుల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా మాడుగుల గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు పుప్పాల అప్పలరాజు నియమితులయ్యారు.
పచ్చికూర రాము తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీలో వున్నారు. పార్టీ మండల అధ్యక్షునిగా మూడు దఫాలు, తెలుగు రైతు అధ్యక్షునిగా, జిల్లా విద్యా కమిటీ సభ్యునిగా పనిచేశారు. కూండ్రం పంచాయతీ తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా వుండడానికి రాము కృషే కారణం. ఆయన కుమార్తె సేనాపతి స్వరూపను 2013లో పంచాయతీ సర్పంచ్‌గా గెలిపించి ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దారు.
మాడుగుల ఏఎంసీ చైర్మన్‌గా నియమితులైన పుప్పాల అప్పలరాజు 1989లో సాధారణ కార్యకర్తగా టీడీపీలో చేరారు. సుమారు 18 సంవత్సరాలపాటు పార్టీ మండల అధ్యక్షునిగా సేవలు అందించారు. 1995 నుంచి 2000 వరకు మాడుగుల ఎంపీపీగా పనిచేశారు. సీడీసీ చైర్మన్‌గా రెండుసార్లు ఎంపికయ్యారు. టీడీపీ జిల్లా కార్యదర్శిగా, ఉపాధ్యక్షునిగా, రాష్ట్రకార్యవర్గ సభ్యునిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం మాడుగుల మోదకొండమ్మ ఆలయ కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. వివాదరహితుడైన అప్పలరాజు.. టీడీపీ అధికారంలో వున్నా, లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారు. అప్పలరాజు భార్య సరోజని గతంలో జడ్పీటీసీ సభ్యురాలిగా పనిచేశారు.
Updated Date - Apr 17 , 2025 | 12:49 AM