ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వాణిజ్య పన్నులశాఖలో బదిలీలు

ABN, Publish Date - Jul 07 , 2025 | 12:35 AM

ఉమ్మడి విశాఖ జిల్లాలోని వాణిజ్య పన్నులశాఖలో పలువురు అధికారులకు బదిలీలు జరిగాయి.

  • జాయింట్‌ కమిషనర్‌, అసిస్టెంట్‌, డిప్యూటీ అసిస్టెంట్‌ కమిషనర్లకు స్థాన చలనం

  • ఉమ్మడి జిల్లాలోని పలు సర్కిల్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు

విశాఖపట్నం, జూలై 6 (ఆంధ్రజ్యోతి):

ఉమ్మడి విశాఖ జిల్లాలోని వాణిజ్య పన్నులశాఖలో పలువురు అధికారులకు బదిలీలు జరిగాయి. జాయింట్‌ కమిషనర్లు, అసిస్టెంట్‌ కమిషనర్లు, డిప్యూటీ అసిస్టెంట్‌ కమిషనర్లకు స్థానం చలనం కలిగింది. విశాఖపట్నం-2 జాయింట్‌ కమిషనర్‌ వై.కిరణ్‌కుమార్‌కు నెల్లూరు బదిలీ అయింది. అనంతపురం జాయింట్‌ కమిషనర్‌ టి.శేషాద్రిని విశాఖపట్నం-2 జాయింట్‌ కమిషనర్‌గా బదిలీచేశారు. ఈయనకే విశాఖపట్నం-1పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

డిప్యూటీ కమిషనర్లు బదిలీ..

విశాఖపట్నం డివిజన్‌-1 పరిధిలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న సీహెచ్‌వీ రవికాంత్‌ చిక్కాకు రాజమహేంద్రవరం బదిలీ అయింది. విశాఖ-2 డివిజన్‌లో పనిచేస్తున్న అపర్ణ కొంపల్లికి విజయవాడ-1, విజయవాడ చీఫ్‌ కమిషనర్‌ ఆఫీస్‌లో పనిచేసే డేవిడ్‌ అనిల్‌ కుమార్‌కు విశాఖలోని వ్యాట్‌ ట్రైబ్యునల్‌ స్టేట్‌ రిప్రజెంటేటివ్‌ ఆఫీస్‌కు బదిలీ చేశారు. ఇదే కార్యాలయంలో పనిచేస్తున్న వై.వెంకటేశ్వర్లును విజయవాడలోని చీఫ్‌ కమిషనర్‌ ఆఫీస్‌కు బదిలీ చేశారు. విశాఖపట్నం డివిజన్‌-2 అనకాపల్లి సర్కిల్‌లో పనిచేస్తున్న దుశ్యంత్‌ కుమార్‌కు విశాఖపట్నం-1 సూర్యాబాగ్‌ సర్కిల్‌కు, ఎయిర్‌ పోర్టు సర్కిల్‌లో పనిచేస్తున్న పంతుల నారాయణశాస్ర్తికి గుంటూరు-2 డివిజన్‌ పిడుగురాళ్ల సర్కిల్‌కు, గాజువాక సర్కిల్‌లో పనిచేస్తున్న మలిశెట్టి వెంకటేశ్వర్లును విజయనగరం వెస్ట్‌ సర్కిల్‌కు బదిలీచేశారు. అచ్యుతాపురం సర్కిల్‌లో పనిచేసే దుర్గాసి శ్వేతను విజయనగరం సౌత్‌ సర్కిల్‌కు, విశాఖ డివిజన్‌-1 పరిధిలోని పి.కృష్ణారావుకు అనకాపల్లి సర్కిల్‌కు, చినవాల్తేరు సర్కిల్‌లో పనిచేసే బీజీఎస్‌ ప్రసాదరావుకు కురుపాం మార్కెట్‌కు, డాబాగార్డెన్స్‌ సర్కిల్‌లో పనిచేస్తున్న వులవకాయల నూకరాజును మాధవధార సర్కిల్‌కు బదిలీ చేశారు. కురుపాం మార్కెట్‌ సర్కిల్‌లో పనిచేసే రత్నాల అనసూయకు ఏలూరు బజార్‌ సర్కిల్‌కు బదిలీ అయింది. సిరిపురం సర్కిల్‌లో పనిచేస్తున్న ఉడతా శ్రీనివాసులును నిడదవోలు సర్కిల్‌కు బదిలీ చేశారు. ద్వారకానగర్‌ సర్కిల్‌లో పనిచేసే కేవీ లక్ష్మీ ప్రసన్నకు కాకినాడ డివిజన్‌ పరిధి జగన్నాయక్‌పూర్‌, విశాఖపట్నం సూర్యాబాగ్‌లో పనిచేసే దుల్లా సాంబశివరావును పాలకొల్లు సర్కిల్‌కు బదిలీ చేశారు. వీరితోపాటు మరో 32 మంది డిప్యూటీ అసిస్టెంట్‌ కమిషనర్లకు బదిలీ లు జరిగాయి. వీరంతా ఉమ్మడి జిల్లా పరిధి నుంచి పలు చోట్లకు వెళ్లారు.

Updated Date - Jul 07 , 2025 | 12:35 AM