తీరంలో విషాదం
ABN, Publish Date - Jun 09 , 2025 | 01:09 AM
సాగరతీరంలో ఆదివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో స్నానానికి దిగిన నలుగురిలో ఓ బాలుడు మృతి చెందగా, ముగ్గురు ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కుటుంబ సభ్యులతో కలిసి ఆర్కే బీచ్‌కు వచ్చిన స్టీల్‌ప్లాంట్ అసిస్టెంట్ మేనేజర్
భార్య, పిల్లలతో సముద్ర స్నానం చేస్తుండగా లోపలకు లాక్కుపోయిన కెరటాలు
స్థానిక యువకులు కాపాడి ఒడ్డుకు తెచ్చేసరికే ఏడేళ్ల కుమారుడి మృతి
బీచ్ రోడ్డు, జూన్ 8 (ఆంధ్రజ్యోతి):
సాగరతీరంలో ఆదివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో స్నానానికి దిగిన నలుగురిలో ఓ బాలుడు మృతి చెందగా, ముగ్గురు ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. కుటుంబంతో సరదాగా గడిపేందుకు స్టీల్‌ప్లాంటులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న సంతోశ్ అగనంపూడి నుంచి ఆర్కే బీచ్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన భార్య శైలజ, కుమారుడు శ్రీపాద సూర్య (7), కుమార్తె సాయితో కలిసి విక్టరీ ఎట్ సీ ఎదురుగా సముద్రంలో స్నానానికి దిగారు. అందరూ సరదాగా గడుపుతుండగా ఒక్కసారిగా అలల ఉధృతికి నలుగురూ సముద్రంలోకి కొట్టుకుపోసాగారు. సమీపంలో ఉన్న పలువురు యువకులు గమనించి వెంటనే సమ్రుదంలోకి వెళ్లి వారిని ఒడ్డుకు తీసుకువచ్చారు. అప్పటికే శ్రీపాద సూర్య అస్వప్థతకు గురవ్వడంతో సపర్యలు చేశారు. 108కు ఫోన్ చేసి సమాచారం అందించడంతో సిబ్బంది వచ్చి బాలుడిని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న మూడో పట్టణ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఎస్‌ఐ పి.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా స్టీల్‌ప్లాంట్ అసిస్టెంట్ మేనేజర్ సంతోశ్‌తో పాటు ఆయన భార్య, కుమార్తె ఉక్కు జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు
మహారాణిపేట. జూన్ 8 (ఆంధ్రజ్యోతి) :
కలెక్టరేట్ లో సోమవారం జరగా ల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు అధికా రులు ఒక ప్రకటనలో తెలిపారు. ఏయూలోని బీఆర్ అంబేడ్కర్ అసెంబ్లీ హాలులో సోమవారం జరిగే షైౖనింగ్ స్టార్స్ అవా ర్డుల ప్రదానోత్సవం కార్య క్రమానికి కలెక్టర్‌తో పాటు పలు ప్రభుత్వ శాఖల అధికారులు హాజరుకా నుండ డంతో పీఆర్‌జీఎస్‌ను రద్దు చేశామని చెప్పారు.
వీఎంఆర్‌డీఏలో కూడా...
ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లలో అధికారులంతా నిమగ్నమై ఉన్నందున సోమవారం వీఎంఆర్డీఏలో జరగనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు కమిషనర్ కేఎస్ విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు.
Updated Date - Jun 09 , 2025 | 01:09 AM