ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

క్షయ రహిత సమాజం దిశగా..

ABN, Publish Date - Jun 06 , 2025 | 12:38 AM

క్షయ వ్యాధిని పారదోలడానికి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నది. ‘టీబీ ముక్తి భారత్‌’ నినాదంతో ఈ వ్యాధి నుంచి ప్రజలను విముక్తి చేయడానికి వైద్య, ఆరోగ్య శాఖ పలు చర్యలు చేపట్టింది. వంద రోజుల్లో అన్ని ఇళ్లకు వెళ్లి టీబీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి వైద్య సిబ్బందిని రంగంలోకి దించారు. క్షయ వ్యాధి ప్రమాదకరంగా మారింది. క్షయ వ్యాధిగ్రస్థులు దగ్గినప్పు

ఆర్‌టీపీసీఆర్‌ సెంటర్‌లో కఫం నమూనా పరీక్షిస్తున్న సిబ్బంది

‘టీబీ ముక్తి భారత్‌’ పేరుతో ప్రభుత్వం వంద రోజుల ప్రణాళిక

రంగంలోకి ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు

ఇంటింటికీ వెళ్లి అనుమానితుల కఫం నమూనాల సేకరణ

ఆర్టీపీసీఆర్‌ సెంటర్లలో నిర్ధారణ పరీక్షలు

పాజిటివ్‌ వస్తే ఆరు నెలలపాటు ఉచితంగా మందులు

పౌష్టికాహారం కోసం నెలకు రూ.1,000 చొప్పున ఆర్థిక సాయం

జిల్లాలో ప్రస్తుతం 1,309 మంది క్షయ బాధితులు

నర్సీపట్నం, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): క్షయ వ్యాధిని పారదోలడానికి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నది. ‘టీబీ ముక్తి భారత్‌’ నినాదంతో ఈ వ్యాధి నుంచి ప్రజలను విముక్తి చేయడానికి వైద్య, ఆరోగ్య శాఖ పలు చర్యలు చేపట్టింది. వంద రోజుల్లో అన్ని ఇళ్లకు వెళ్లి టీబీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి వైద్య సిబ్బందిని రంగంలోకి దించారు.

క్షయ వ్యాధి ప్రమాదకరంగా మారింది. క్షయ వ్యాధిగ్రస్థులు దగ్గినప్పుడు వారి నోటి నుంచి వెలువడే తుంపర్ల కారణంగా ఇతరుకు వ్యాపిస్తుంది. ప్రస్తుతం జిల్లాలో 1,309 మంది క్షయ బాధితులు ఉన్నారు. నర్సీపట్నం, అనకాపల్లి, అచ్యుతాపురం, కోటవురట్ల, ఎలమంచిలి, నక్కపల్లి, చోడవరం, కేజేపురం, కె.కోటపాడుల్లోని ప్రభుత్వ టీబీ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. నర్సీపట్నం ఆర్టీపీసీఆర్‌ సెంటర్‌లో నెలకు 350 నుంచి 400 మందికి కఫం పరీక్షలు నిర్వహిస్తుంటే వీరిలో 20 నుంచి 25 మందికి పాజిటివ్‌ వస్తున్నది. క్షయ వ్యాధి నుంచి ప్రజలకు విముక్తి కలిగించడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నది. ‘టీబీ ముక్తి భారత్‌’ నినాదంతో క్షయ గురించి ప్రజలకు అవగాహన, ఉపసమనం కలిగించడానికి వైద్య, ఆరోగ్య శాఖ రంగంలోకి దిగింది. ‘వంద రోజుల’ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలను బుధవారం రంగంలోకి దించింది. ఈ బృందాలు ఇంటింటికీ వెళ్లి ఎక్కువ రోజులు దగ్గుతో బాధపడుతున్న వారి నుంచి కఫం నమూనాలు సేకరిస్తున్నారు. మద్యం, ధూమపాన అలవాటు వున్నవారు, మధుమేహం, కిడ్నీ సంబంధ వ్యాధి, హెచ్‌ఐవీతో బాధపడుతున్న వ్యక్తులు, పోషకాహారం లోపతో బాధపడుతున్న వారు, క్యాన్సర్‌, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, క్షయకు మందులు వాడి నయమైన వారు, వారి కుటుంబ సభ్యులకు స్ర్కీనింగ్‌ పరీక్షలు చేస్తారు. అవసరమైన వారికి ఎక్స్‌రే, స్కానింగ్‌ పరీక్షలు ఉచితంగా చేస్తారు. క్షయ నిర్ధారణ అయితే ఆరు నెలలకు సరిపడ మందును ఉచితంగా ఇస్తారు. అంతేకాక క్షయ పోషణ పథకం కింద ప్రతి నెలా రూ.1,000లను వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. క్షయ నివారణ మందులను క్రమం తప్పకుండా వాడేలా ఆశా వర్కర్లు వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తారు. జిల్లాలో ఉన్న 27 ఆర్టీపీసీఆర్‌ కేంద్రాలలో కఫం పరీక్షలు చేస్తున్నారు.

రెండు వారాలకుపైగా దగ్గు తగ్గక పోవడం, రాత్రి సమయంలో జ్వరం రావడం, ఆకలి మందగించడం, బరువు తగ్గిపోవడం, ఆయాసం, దగ్గినప్పుడు కఫంలో రక్తం పడడం వంటి క్షయ లక్షణాలు అని నర్సీపట్నం క్షయ యూనిట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ప్రశాంతి తెలిపారు. వంద రోజుల్లో క్షయ స్ర్కీనింగ్‌, కఫం, ఇతర పరీక్షలు పూర్తి చేసి, అవసరమైన వారికి చికిత్స అందిస్తామని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ జ్యోతి తెలిపారు. క్షయ వ్యాధిని నిర్మూలించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆమె చెప్పారు.

Updated Date - Jun 06 , 2025 | 12:38 AM