పర్యాటక శాఖ భూములు లీజుకు...
ABN, Publish Date - Jul 22 , 2025 | 01:14 AM
రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక పాలసీని రూపొందించింది.
ఔత్సాహికులకు అవకాశం
ప్రాజెక్టులు పర్యాటకులను ఆకర్షించేలా, ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడేలా, ఉపాధి అవకాశాలు కల్పించేలా ఉండాలి
ఎంఎస్‌ఎంఈలకు ప్రాధాన్యం
విశాఖ జిల్లాలో 18కి పైగా ప్రాంతాలు
అనకాపల్లిలో 5...
పారదర్శక విధానంలో కేటాయింపునకు కమిటీ ఏర్పాటు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక పాలసీని రూపొందించింది. ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడానికి, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రభుత్వ భూములను దీర్ఘకాలిక లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ వ్యవహారం పారదర్శకంగా జరగడానికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ అధ్యక్షతన మరో ఎనిమిది మందితో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసింది. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో గల ప్రభుత్వ భూముల్లో పర్యాటక అభివృద్ధికి ఉపయోగపడే వాటిని ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ (ఏపీటీఏ)కి అప్పగించింది. ఔత్సాహికులు ఎవరైనా సరే ఏపీటీఏకి దరఖాస్తు చేస్తే, వాటిని కమిటీ పరిశీలించి భూముల కేటాయింపునకు సిఫారసు చేస్తుంది. విశాఖపట్నంలో జిల్లాలో 18 ప్రాంతాలు, అనకాపల్లి జిల్లాలో ఐదు ప్రదేశాలు లీజుకు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఎటువంటి ప్రాజెక్టులంటే..?
పర్యాటకులను ఆకర్షించేలా, ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడేలా, ఉపాధి అవకాశాలు పెరిగేలా ప్రాజెక్టులు ఉండాలి. భూమిని తీసుకున్న వారు మౌలిక వసతులు అభివృద్ధి చేయాలి. హోటళ్లు, రిసార్ట్స్, వెల్‌నెస్ సెంటర్లు, ఎమ్యూజ్‌మెంట్ పార్కులు, మైస్ సౌకర్యం (చిన్న చిన్న సమావేశాలు, సభలు నిర్వహించుకునేలా) కల్పించేలా ప్రాజెక్టులు రూపొందించాలి. పెట్టుబడి మొత్తం వారే పెట్టుకోవాలి. ప్రాజెక్టును బట్టి ఎంత కాలం భూమిని లీజుకు ఇవ్వాలనేది కమిటీ నిర్ణయిస్తుంది. ఇవన్నీ పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలోనే చేపడతారు. భూ కేటాయింపునకు ప్రత్యేక పాలసీ రూపొందించారు. రాయితీలు కూడా పాలసీలో పొందుపరిచారు. లార్జ్, మెగా, ఆల్ర్టా మెగా ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
జిల్లాలో ఎక్కడెక్కడంటే...?
- మధురవాడ సర్వే నంబరు 426/పిలో 10 ఎకరాలు.
- భీమిలి మండలం కొత్తవలసలో 102/2, 103లలో 15 ఎకరాలు
- ఎండాడ సర్వే నంబరు 187లో 17 ఎకరాలు.
- భీమిలి మండలం చేపలుప్పాడ సర్వే నంబరు 53/2ఏలో 2.44 ఎకరాలు.
- ఆనందపురం మండలం దబ్బంద, ఆనందపురం సర్వే నంబర్లు 130/7, 131/1, 131/2, 131/4లలో 7.15 ఎకరాలు
- భీమిలి మండలం కాపులుప్పాడ సర్వే నంబర్లు 392/2, 393/3, 394/2లలో 40 ఎకరాలు
- భీమిలి మండలం నేరెళ్లవలస సర్వే నంబర్లు 96, 121/2, 122/2లలో 11.65 ఎకరాలు
- విశాఖపట్నం వాల్తేరు వార్డు టౌన్ సర్వే నంబరు 1012లో 1.26 ఎకరాలు
- విశాఖ గ్రామీణ మండలం ఎండాడ సర్వే నంబరు 113/5లో 31 సెంట్లు.
- ఎండాడలో సర్వే నంబరు 187లో 3 ఎకరాలు.
- రుషికొండ సర్వే నంబరు 38లో 8.44 ఎకరాలు.
- రామానాయుడు స్టూడియో సమీపాన సర్వే నంబరు 426/2లో 5 ఎకరాలు
- భీమిలి మండలం అన్నవరం ఎల్‌పీ నంబరు 1356, 1360లలో 17.25 ఎకరాలు
- ఎండాడ సర్వే నంబర్లు 106/1, 106/4లలో 2.33 ఎకరాలు.
- గాజువాక మండలం యారాడ సర్వే నంబరు 53/పిలో 5 ఎకరాలు.
- నేరెళ్లవలస సర్వే నంబరు 126లో 1.70 ఎకరాలు
- కాపులుప్పాడ సర్వే నంబర్లు 284/3, 287/4, 287/5, 288/2లలో 17.42 ఎకరాలు.
- ఎండాడలో సర్వే నంబర్లు 183, 184, 185లో 9 సెంట్లు
- అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి మండలం న్యాయంపూడి సర్వే నంబరు 80/2లో 1.17 ఎకరాలు.
- పరవాడ మండలం ముత్యాలమ్మ పాలెం సర్వే నంబరు 324/2లో 12.52 ఎకరాలు
- అచ్యుతాపురం మండలం పూడిమడక సర్వే నంబరు 85/3లో 2.58 ఎకరాలు
- ఎస్.రాయవరం మండలం గుడివాడ (రేవుపోలవరం) సర్వే నంబరు 380లో 5 ఎకరాలు
- అనకాపల్లి మండలం శంకరంలో 150, 143, 144, 154 సర్వే నంబర్లలో 1.4 ఎకరాలు
- అల్లూరి జిల్లా అనంతగిరి మండలం నందకోట సర్వే నంబర్లు 22, 28లలో 43.1 ఎకరాలు
Updated Date - Jul 22 , 2025 | 01:14 AM