నేడు జగన్నాథుని రథయాత్ర
ABN, Publish Date - Jun 27 , 2025 | 12:57 AM
జగన్నాథుని రథోత్సవానికి రంగం సిద్ధమైంది. టౌన్ కొత్తరోడ్డులోని ఆలయం వద్ద ఉదయం 9.20 గంటలకు జగన్నాథ స్వామి రథంపై కొలువుదీరుతారు.
వేడుకగా కల్యాణ మహోత్సవం
మహారాణిపేట, జూన్ 26 (ఆంధ్రజ్యోతి):
జగన్నాథుని రథోత్సవానికి రంగం సిద్ధమైంది. టౌన్ కొత్తరోడ్డులోని ఆలయం వద్ద ఉదయం 9.20 గంటలకు జగన్నాథ స్వామి రథంపై కొలువుదీరుతారు. సాయంత్రం 4.15 గంటలకు రథయాత్ర ప్రారంభమవుతుంది. టర్నర్ చౌలీ్ట్ర వద్ద కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన గుండిచా మందిరంలో స్వామి పదిరోజుల పాటు దశావతారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. జూలై ఏడో తేదీన మారు రథయాత్ర నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆలయంలో బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథుని కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వైఖానస ఆగమ సంప్రదాయంలో, మంగళవాయిద్యాలు, వేద మంత్రాల మధ్య కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఈవో టి.రాజగోపాల్‌రెడ్డి, ఆధ్యాత్మికవేత్త ఎంవీ రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 27 , 2025 | 12:57 AM