ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పుట్టగొడుగులు తిన్న ముగ్గురు బాలురకు అస్వస్థత

ABN, Publish Date - May 23 , 2025 | 12:38 AM

మండలంలోని నుర్మతి పంచాయతీ కేంద్రానికి చెందిన ముగ్గురు బాలురు పుట్టగొడుగులు తిని అస్వస్థతకు గురయ్యారు. దీనికి సంబంధించి వారి తల్లిదండ్రులు, ఫీడర్‌ అంబులెన్స్‌ ఈఎంటీ పోతురాజు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. నుర్మతికి చెందిన అరగడ సురేశ్‌(11), అరగడ బాబు(10), అరగడ విక్రమ్‌(8) తల్లిదండ్రులు గురువారం వ్యవసాయ పనులకు వెళ్లారు.

బాలురను ఫీడర్‌ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం

- ఆస్పత్రికి తరలింపు - ఇద్దరి పరిస్థితి విషమం

జి.మాడుగుల, మే 22 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నుర్మతి పంచాయతీ కేంద్రానికి చెందిన ముగ్గురు బాలురు పుట్టగొడుగులు తిని అస్వస్థతకు గురయ్యారు. దీనికి సంబంధించి వారి తల్లిదండ్రులు, ఫీడర్‌ అంబులెన్స్‌ ఈఎంటీ పోతురాజు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. నుర్మతికి చెందిన అరగడ సురేశ్‌(11), అరగడ బాబు(10), అరగడ విక్రమ్‌(8) తల్లిదండ్రులు గురువారం వ్యవసాయ పనులకు వెళ్లారు. వీరంతా బంధువులే. కాగా స్థానిక పాఠశాలలో సురేశ్‌ ఆరవ తరగతి, బాబు ఐదవ తరగతి, విక్రమ్‌ నాల్గవ తరగతి చదువుతున్నారు. వేసవి సెలవులు కావడంతో వీరు గురువారం మధ్యాహ్నం ఇంటికి సమీపంలో పుట్టగొడుగులు సేకరించారు. వాటిని వండుకుని తిన్నారు. దీంతో వారు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలిసి వారి తల్లిదండ్రులు వెంటనే ఫీడర్‌ అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. ఫీడర్‌ అంబులెన్స్‌ రావడంతో వారిని జి.మాడుగుల పీహెచ్‌సీకి తరలించారు. వీరిలో అరగడ బాబు, అరగడ విక్రమ్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు ఈఎంటీ పోతురాజు తెలిపారు.

Updated Date - May 23 , 2025 | 12:38 AM