హెల్మెట్ వాడరు.. చలానా కట్టరు
ABN, Publish Date - Jun 01 , 2025 | 12:25 AM
జిల్లా పరిధిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు పెరుగుతున్నాయి. పోలీసులు చలానాలు విధిస్తున్నా ట్రాఫిక్ ఉల్లంఘనదారులు ఖాతరు చేయడం లేదు. నిబంధనలను ఉల్లంఘించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నా మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఎక్కువ సార్లు నిబంధనలు ఉల్లఘించిన వారిపై పోలీసులు దృష్టి పెట్టారు.
- పెరుగుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలు
- పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నా మార్పు రాని వైనం
- ఎక్కువ సార్లు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ప్రత్యేక దృష్టి
అనకాపల్లి రూరల్, మే 31 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిధిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు పెరుగుతున్నాయి. పోలీసులు చలానాలు విధిస్తున్నా ట్రాఫిక్ ఉల్లంఘనదారులు ఖాతరు చేయడం లేదు. నిబంధనలను ఉల్లంఘించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నా మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఎక్కువ సార్లు నిబంధనలు ఉల్లఘించిన వారిపై పోలీసులు దృష్టి పెట్టారు.
జిల్లా పరిధిలో చాలా మంది ద్విచక్ర వాహనదారులు మోటార్ వాహన చట్టం నిబంధనలను పదే పదే ఉల్లంఘిస్తున్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, బైక్‌పై ముగ్గురు చొప్పున వెళుతుండడం సాధారమైపోయింది. వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ మాట్లాడేవారు కొందరైతే, మితిమీరిన వేగంతో రాంగ్ రూట్‌లో ప్రయాణించేవారు ఇంకొందరు ఉంటున్నారు. అలాగే కారుల్లో ప్రయాణించేవారు సీటు బెల్ట్ పెట్టుకోవడం లేదు. అటువంటి వారందరికీ ట్రాఫిక్ పోలీసులు చలానాలు రాస్తున్నారు.
ఈ- చలానాల వసూళ్లపై దృష్టి
ఈ- చలానాల వసూళ్లపై పోలీసులు దృష్టి పెట్టారు. జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి గతంలో విధించిన ఈ-చలానాలకు సంబంధించిన జాబితాను తయారు చేశారు. దీంతో ఎక్కువ మంది అనేక సార్లు నిబంధనలను ఉల్లంఘించిన విషయం బయటపడింది. ఇప్పటి వరకు కేవలం ఉల్లంఘనదారులపై చలానాల జారీపై మాత్రమే దృష్టి పెట్టారు. దీని వల్ల చెల్లించే వారు చెల్లిస్తున్నారు, మిగిలిన వారు తమకు పట్టనట్టు వదిలేస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రవాణాశాఖ సర్వర్‌లోని వివరాల ఆధారంగా వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. పోలీసులు ద్విచక్ర వాహనాలు, కార్లు, భారీ వాహనాలను ఆపి వివరాలు పరిశీలిస్తున్నారు. ఆ వాహనాలపై చలానాలు ఉంటే వాహనదారునికి వివరిస్తున్నారు. చెల్లించాలని చెబుతున్నారు. చాలా మంది డిజిటల్ పద్ధతిలో అప్పటికప్పుడు చెల్లిస్తున్నారు.
----------
సంవత్సరం ఈ- చలానాలు మొత్తం చెల్లించిన చలానాలు చెల్లించిన మొత్తం
---------------------------------------------------
2024 95,203 రూ.2,46,80,847 29,937 71,95,981
(జనవరి- డిసెంబరు)
2025 27,009 రూ. 89,77,652 8,903 23,69,676
(జనవరి నుంచి మే 28 వరకు)
--------------------------------------------------------------------------------------------
Updated Date - Jun 01 , 2025 | 12:25 AM