ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తాడి నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో చోరీ

ABN, Publish Date - Apr 30 , 2025 | 12:59 AM

మండలంలోలోని తాడి గ్రామంలో వున్న ఉమా నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ ప్రధాన ద్వారం తలుపులు పగలగొట్టి ఆరు కిలోల వెండి ఆభరణాలతోపాటు హుండీలో కానుకల సొమ్ము అపహరించుకుపోయారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

చోరులు విరగ్గొట్టిన గర్భగుడి తలుపులు

ఆరు కిలోల వెండి ఆభరణాలు అపహరణ

హుండీని పగలగొట్టి కానుకల నగదు సైతం..

పరవాడ, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోలోని తాడి గ్రామంలో వున్న ఉమా నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ ప్రధాన ద్వారం తలుపులు పగలగొట్టి ఆరు కిలోల వెండి ఆభరణాలతోపాటు హుండీలో కానుకల సొమ్ము అపహరించుకుపోయారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ఆలయ ప్రధాన అర్చకుడు రామారావు రోజూ మాదిరిగానే మంగళవారం ఉదయం ఆలయంలో పూజలు చేసేందుకు వెళ్లారు. ఆలయ మండపం ప్రధాన గేటుతోపాటు గర్భగుడికి ముందున్న ఇనుపగేటు, తర్వాత ఉన్న ప్రధానద్వారం తలుపులు పగులగొట్టి ఉండడాన్ని గమనించారు. గర్భగుడిలోకి వెళ్లి చూడగా స్వామివారికి అలంకరించిన మూడు కిలోల వెండి నాగాభరణం, మూడు కిలోల వెండి కవచం కనిపించలేదు. హుండీ సైతం పగులగొట్టి ఉంది. వెండి ఆభరనాలతోపాటు, హుండీలో నగదు చోరీ అయినట్టు నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ కృష్ణారావు, సిబ్బందితో ఆలయానికి చేరుకుని పరిశీలించారు. అప్పటికే అక్కడ వున్న ఆలయ కమిటీ సభ్యులతో మాట్లాడారు. క్లూస్‌టీమ్‌ వచ్చి వేలిముద్రలు సేకరించారు. చోరీకి గురైన వెండి ఆభరణాలు విలువ సుమారు రూ.5.5 లక్షలు వుంటుందని ఆలయ కమిటీ సభ్యులు చెబుతున్నారు. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.

Updated Date - Apr 30 , 2025 | 12:59 AM