ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఈదురుగాలుల బీభత్సం

ABN, Publish Date - Apr 20 , 2025 | 11:15 PM

అరకులోయ పరిసర ప్రాంతాలైన కొత్తభల్లుగుడ, సుంకరమెట్ట, బొండాం పంచాయతీ పరిధిలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గన్నెల పంచాయతీ కొసిగుడ గ్రామంలో దూసరి హరి అనే గిరిజనుడి ఇంటిపై జీలుగు చెట్టు కూలడంతో ఇంటి పైరేకులు ధ్వంసమయ్యాయి.

పెదబయలులో ధ్వంసమైన ఇల్లు

బొండాం పరిసరాల్లో భారీ వర్షం

పిడుగుపాటుకు రెండు పశువులు మృతి

పెదబయలులో మూడు ఇళ్లు ధ్వంసం

అరకులోయ, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): అరకులోయ పరిసర ప్రాంతాలైన కొత్తభల్లుగుడ, సుంకరమెట్ట, బొండాం పంచాయతీ పరిధిలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గన్నెల పంచాయతీ కొసిగుడ గ్రామంలో దూసరి హరి అనే గిరిజనుడి ఇంటిపై జీలుగు చెట్టు కూలడంతో ఇంటి పైరేకులు ధ్వంసమయ్యాయి. అలాగే బొండాం పంచాయతీ రంగినిగుడ గ్రామ సమీప కొండపై పిడుగుపడి ఆ గ్రామానికి చెందిన కిల్లో మొద్దు, స్వాబి సింహాచలం అనే గిరి రైతుల రెండు దుక్కిటెద్దులు మృతి చెందాయి.

పెదబయలులో..

పెదబయలు: మండలంలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి మూడు ఇళ్లు ధ్వంసమయ్యాయి. మండలంలోని మారుమూల జామిగూడ పంచాయితీలోని పినరావల్లి గ్రామంలో కిల్లో లక్ష్మి, మండి సావిత్రి ఇళ్ల గోడలు కూలిపోయాయి. అదే గ్రామానికి చెందిన మండి ప్రభుదాస్‌ ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నది.

Updated Date - Apr 20 , 2025 | 11:15 PM