వరినారు కాపాడుకోవడానికి అన్నదాతల పాట్లు
ABN, Publish Date - Aug 01 , 2025 | 12:31 AM
వారం రోజుల నుంచి తీక్షణంగా కాస్తున్న ఎండలకు వరినారు మడులు ఎండుతున్నాయి. నారును కాపాడుకోవడానికి రైతులు నానాపాట్లు పడుతున్నారు. సుమారు నెల రోజుల క్రితం కురిసిన వర్షాలకు రైతులు ఆకుమడులు పోశారు. తరువాత అడపాదడపా వర్షాలు కురవడంతో నారు ఆశాజనంగా పెరుతున్నది.
మాకవరపాలెం, జూలై 31 (ఆంధ్రజ్యోతి): వారం రోజుల నుంచి తీక్షణంగా కాస్తున్న ఎండలకు వరినారు మడులు ఎండుతున్నాయి. నారును కాపాడుకోవడానికి రైతులు నానాపాట్లు పడుతున్నారు. సుమారు నెల రోజుల క్రితం కురిసిన వర్షాలకు రైతులు ఆకుమడులు పోశారు. తరువాత అడపాదడపా వర్షాలు కురవడంతో నారు ఆశాజనంగా పెరుతున్నది. అయితే వారం నుంచి వర్షాలు పడకపోగా, ఎండలు మండిపోతుండడంతో నారు ఎండిపోతున్నది. పలువురు రైతులు ఇంజన్లతో గెడ్డలు, బావుల్లో నీటిని తోడిపోసి వరి నారును బతికించుకుంటున్నారు. ఇంజన్లు లేని రైతులు నేల బావుల నుంచి బిందెలతో నీటిని తెచ్చి నారుమళ్లను తడుపుకోవాల్సి వస్తున్నది. రానున్న వారం, పది రోజుల్లో వర్షాలు పడకపోతే వరినాట్లు వేయడం కష్టమేనని రైతులు అంటున్నారు.
Updated Date - Aug 01 , 2025 | 12:31 AM