నూకాంబిక ఆలయానికి కొనసాగిన భక్తుల రద్దీ
ABN, Publish Date - May 26 , 2025 | 12:29 AM
అనకాపల్లి నూకాంబిక అమ్మవారి దర్శనం కోసం ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆలయం ప్రాంగణం కిటకిటలాడింది.
అనకాపల్లి నూకాంబిక అమ్మవారి దర్శనం కోసం ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆలయం ప్రాంగణం కిటకిటలాడింది. నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర ముగిసి నాలుగు వారాలు అయినప్పటికీ భక్తుల తాకిడి తగ్గలేదు. ప్రస్తుతం విద్యా సంస్థలకు సెలవులు కావడంతో ఇతర రోజుల్లో కూడా కుటుంబాలతో సహా ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. బాలాలయంతో పాటు క్యూలైన్లు అన్ని భక్తులతో నిండిపోయాయి. సాయంత్రం వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. ఆలయ ఈవో వెంపలి రాంబాబు, ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ పీలా నాగశ్రీను ఏర్పాట్లను పర్యవేక్షించారు.
-అనకాపల్లి టౌన్/ ఆంధ్రజ్యోతి
Updated Date - May 26 , 2025 | 12:31 AM