ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వీడని వాన

ABN, Publish Date - Jun 25 , 2025 | 12:32 AM

మన్యంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు చిత్తడిగా మారాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు చెదురుమదురుగా వర్షం కురుస్తూ ఉండడంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు.

పాడేరులో వర్షం

జీకేవీధిలో అత్యధికంగా 14.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

పాడేరురూరల్‌, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): మన్యంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు చిత్తడిగా మారాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు చెదురుమదురుగా వర్షం కురుస్తూ ఉండడంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. వాహనచోదకులు అవస్థలు పడ్డారు. వారపు సంతలకు వెళ్లే చిరువ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీకేవీధిలో అత్యధికంగా 14.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, జి.మాడుగులలో 13.5, పాడేరులో 11.3, హుకుంపేటలో 10.3, పెదబయలులో 8.5, అనంతగిరి, చింతపల్లిలో 7.0, కొయ్యూరులో 6.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

అరకులోయలో..

అరకులోయ: పట్టణంలో మంగళవారం ఉదయం నుంచి ముసురు వాతావరణం నెలకొంది. మోస్తరు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో జనజీవనానికి స్వల్ప అంతరాయం ఏర్పడింది. రహదారులు చిత్తడిగా మారడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు.

జీకేవీధిలో..

గూడెంకొత్తవీధి మండలంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం పడింది. దీంతో మన్యంలో అత్యధిక వర్షపాతం నమోదైంది.

హుకుంపేటలో..

హుకుంపేట: మండలంలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. రహదారి చిత్తడిగా మారి రాకపోకలకు వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజీల్లో వరద నీరు పొంగి ప్రవహించింది. వర్షం వల్ల రైతులు వ్యవసాయ పనులకు వెళ్లలేదు. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉందని రైతులు తెలిపారు.

Updated Date - Jun 25 , 2025 | 12:33 AM