ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సారథులు మనోళ్లే...

ABN, Publish Date - Jul 01 , 2025 | 01:26 AM

రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో విశాఖపట్నం ఇప్పుడు కీలకంగా మారింది.

  • రెండు ప్రధాన పార్టీలకు రాష్ట్ర అధ్యక్షులుగా విశాఖ వాసులు

  • రాజకీయ చిత్రపటంలో కీలకంగా నగరం

  • ఇరువురూ ఉన్నత విద్యావంతులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో విశాఖపట్నం ఇప్పుడు కీలకంగా మారింది. కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలు ఉండగా వాటిలో ప్రధానమైన తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వ్యవహరిస్తున్నారు. మరో పార్టీ బీజేపీకి రాష్ట్ర అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ ఎన్నికకాబోతున్నారు. ఆయన కూడా విశాఖపట్నం వాసే కావడం గమనార్హం.

గత ఏడాది జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇచ్చి గౌరవించింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఆయన 2019-24 మధ్య పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ పెద్దలు ఎన్ని తాయిలాలు చూపినా పార్టీని వీడకుండా ఉండి, వారి వేధింపులను ఎదుర్కొన్నారు. గాజువాకలో ఆయన నిర్మిస్తున్న వాణిజ్య భవన సముదాయాన్ని కూలగొట్టినా లొంగకుండా పార్టీ కోసం నిలబడ్డారు. స్టీల్‌ ప్లాంటు ఉద్యోగుల కోసం నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన్ను బీసీల నాయకుడిగా గుర్తించి అధిష్ఠానం పార్టీ అధ్యక్షుడిని చేసింది. పల్లా శ్రీనివాసరావు తండ్రి సింహాచలం కార్మిక సంఘ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకొని ఆ తరువాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన వారసత్వాన్ని పల్లా నిలబెట్టారు.

ఇప్పుడు అదే కోవలో మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి లభించింది. మాధవ్‌ తండ్రి పీవీ చలపతిరావు కూడా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆరేళ్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు. తండ్రి బాటలోనే మాధవ్‌ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చి దేశమంతా పర్యటించారు. పార్టీ సిద్ధాంతాలను ఔపాసన పట్టి ఆ మార్గంలోనే ముందుకు నడిచారు. పార్టీలో కీలక పదవులు నిర్వర్తించారు. బీజేపీలో తండ్రితో పనిచేసిన అగ్ర నాయకులందరితో సత్సంబంధాలు ఉండడం, మృదుస్వభావం కలిగి, పార్టీ ఉన్నతి కోసం నిత్యం క్షేత్రస్థాయిలో పనిచేస్తుండడంతో అధిష్ఠానం ఆయన సేవలను గుర్తించింది. గతంలో నాటి పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజును తప్పించి కొత్తవారికి బాధ్యతలు అప్పగించాలని అధిష్ఠానం యోచించినప్పుడే మాధవ్‌ పేరు పరిశీలనకు వచ్చింది. అయితే సీనియర్‌ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరికి పెద్దలు అవకాశం కల్పించారు. ఇప్పుడు కొత్త అధ్యక్షులను ఎన్నుకునే సమయం రావడంతో ఆ పదవి కోసం చాలా మంది పోటీ పడ్డారు. అయితే అధిష్ఠానం మాత్రం బీజేపీ మూలాలు కలిగిన వారికే పట్టం కట్టాలని భావించి మాధవ్‌ను ఎంపిక చేసింది.

Updated Date - Jul 01 , 2025 | 01:26 AM