ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గిరి విద్యార్థుల ఆనందోత్సాహం

ABN, Publish Date - Jun 21 , 2025 | 11:13 PM

గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల ఆనందానికి అవధుల్లేవు. విశాఖపట్నంలో శుక్రవారం సాయంత్రం 25 వేల మంది గిరిజన విద్యార్థులతో నిర్వహించిన 108 సూర్యనమస్కారాల ప్రదర్శన గిన్నిస్‌ బుక్‌ రికార్డులో నమోదు కావడంతో వారి ఖ్యాతి ఇనుమడించింది.

ఆనందంతో విక్టరీ సింబల్‌ చూపుతున్న గిరిజన బాలికలు

యోగాసనాల్లో గిన్నిస్‌ రికార్డుతో ఇనుమడించిన ఖ్యాతి

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల ఆనందానికి అవధుల్లేవు. విశాఖపట్నంలో శుక్రవారం సాయంత్రం 25 వేల మంది గిరిజన విద్యార్థులతో నిర్వహించిన 108 సూర్యనమస్కారాల ప్రదర్శన గిన్నిస్‌ బుక్‌ రికార్డులో నమోదు కావడంతో వారి ఖ్యాతి ఇనుమడించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 7న అరకులోయలో 21 వేల మంది గిరిజన విద్యార్థులతో నిర్వహించిన 108 సూర్యనమస్కారాల ప్రదర్శన ప్రపంచ రికార్డుగా నమోదైన విషయం తెలిసిందే. తాజాగా వారు సూర్యనమస్కారాలతో గిన్నిస్‌బుక్‌ రికార్డు సాధించడంపై ప్రధాన మోదీ, సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఆనందం వ్యక్తం చేసి, గిరిజన విద్యార్థులను అభినందించారు. ఈ ఘనత సాధించడం వెనుక గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎల్‌.రజని కృషి ఎంతో ఉందని అధికారులు అంటున్నారు. ఆమెను కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, ఇతర అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.

Updated Date - Jun 21 , 2025 | 11:13 PM