పండుగలా అన్నదాత సుఖీభవ
ABN, Publish Date - Aug 01 , 2025 | 12:32 AM
అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ యోజన’ కార్యక్రమాన్ని ఆగస్టు రెండో తేదీన పండుగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొని సీఎం ప్రసంగాన్ని ఆలకించారు.
రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.7 వేలచొప్పున రేపు జమ
జిల్లాలో 2,31,688 మంది అన్నదాతలకు లబ్ధి
అనకాపల్లి కలెక్టరేట్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ‘అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ యోజన’ కార్యక్రమాన్ని ఆగస్టు రెండో తేదీన పండుగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొని సీఎం ప్రసంగాన్ని ఆలకించారు. అనంతరం ఆమె జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ యోజన కింద అర్హులైన రైతులందరికీ ఆర్థిక సాయం అందేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, కేంద్రం ప్రభుత్వం రూ.2 వేలు కలిపి మొత్తం రూ.7 వేలు ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని కలెక్టర్ తెలిపారు. ఈ పథకానికి జిల్లాలో ఇంతవరకు 2,31,688 మంది రైతులను అర్హులుగా గుర్తించాన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రావు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జి.మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Aug 01 , 2025 | 12:32 AM