లంబసింగిలో పర్యాటకుల సందడి
ABN, Publish Date - Jul 20 , 2025 | 11:05 PM
ఆంధ్ర కశ్మీర్ లంబసింగిలో పర్యాటకులు ఆదివారం సందడి చేశారు. గత నాలుగు రోజులుగా వాతావరణం అనుకూలించడంతో ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు తరలి వచ్చారు.
చెరువులవేనం వద్ద పర్యాటకులు
చింతపల్లి, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర కశ్మీర్ లంబసింగిలో పర్యాటకులు ఆదివారం సందడి చేశారు. గత నాలుగు రోజులుగా వాతావరణం అనుకూలించడంతో ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు తరలి వచ్చారు. ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద ప్రకృతి సౌందర్యాన్ని వీక్షిస్తూ ఎంజాయ్ చేశారు. తాజంగి జలాశయం, లంబసింగి జంక్షన్‌లో పర్యాటకుల రద్దీ కనిపించింది. ప్రస్తుతం పర్యాటక సీజన్ కాకపోయినప్పటికి లంబసింగికి పర్యాటకులు వస్తున్నారు.
Updated Date - Jul 20 , 2025 | 11:05 PM