ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉపాధి శ్రామికుల ఆకలి కేకలు

ABN, Publish Date - May 18 , 2025 | 11:09 PM

సకాలంలో వేతనాలు అందక ఉపాధి హామీ పథకం శ్రామికులు అర్థాకలితో అలమటిస్తున్నారు. పనులు చేసిన వారం రోజుల్లో వేతనాలు చెల్లించాలని ఉపాధి హామీ చట్టం చెబుతున్నా అది అమలు కాకపోవడంతో శ్రామికులు ఇబ్బంది పడుతున్నారు. సుమారు యాభై రోజుల నుంచి వేతనాలు రావడం లేదని ఆవేదన చెందుతున్నారు.

వి.కోడాపల్లిలో చెరువు పనులు చేస్తున్న ఉపాధి శ్రామికులు

యాభై రోజులుగా అందని వేతనాలు

అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన

పనులు చేసిన వారం రోజుల్లో చెల్లింపులు జరపాలని నిబంధన ఉన్నా అమలుకాని వైనం

జి.మాడుగుల, మే 18 (ఆంధ్రజ్యోతి): సకాలంలో వేతనాలు అందక ఉపాధి హామీ పథకం శ్రామికులు అర్థాకలితో అలమటిస్తున్నారు. పనులు చేసిన వారం రోజుల్లో వేతనాలు చెల్లించాలని ఉపాధి హామీ చట్టం చెబుతున్నా అది అమలు కాకపోవడంతో శ్రామికులు ఇబ్బంది పడుతున్నారు. సుమారు యాభై రోజుల నుంచి వేతనాలు రావడం లేదని ఆవేదన చెందుతున్నారు.

మండలంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద ఏప్రిల్‌ మొదటి వారంలో భూమి చదును, చెరువుల తవ్వకాలు ప్రారంభమయ్యాయి. పనులు పూర్తిస్థాయిలో జరిగినా శ్రామికులకు వేతనాలను మాత్రం ఇప్పటి వరకు చెల్లించలేదు. వేతనాలు అందకపోవడంతో అప్పులు చేసి కుటుంబాన్ని పోషించాల్సి వస్తోందని పలువురు శ్రామికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో అత్యంత పేదరికంతో జీవిస్తున్న గిరిజనులకు ఉపాధి అవకాశాలను కల్పించడం సంతోషించదగినదే.. కానీ, కల్పించిన పనుల అనంతరం వారం రోజుల్లో వేతనాలు జమ చేయాలని ఉపాధి చట్టంలో నిర్దేశిస్తోంది. దీనికి భిన్నంగా చేసిన పనులకు నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడంతో శ్రామికులు ఆకలితో అలమటిస్తున్నారు. ఉపాధి చట్టం ప్రకారం పేదలకు జీవన భద్రత కల్పించాలి. వేతనాలు చెల్లించక, పూర్తిస్థాయిలో పనులు కల్పించక గ్రామాల నుంచి అనేక మంది వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - May 18 , 2025 | 11:09 PM