ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రామ స్వరాజ్యమే లక్ష్యం

ABN, Publish Date - Jun 11 , 2025 | 12:54 AM

రాష్ట్రంలో ప్రతి పల్లెకూ గ్రామ స్వరాజ్యం తీసుకురావాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పలు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నదని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశాల మేరకు మండలంలోని సోమవరం గ్రామంలో మంగళవారం ‘పల్లె పిలుస్తోంది రా.. కదలి రా!’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సోమవరం గ్రామంలోని ఎన్టీఆర్‌ కల్యాణ మండపంలో రైతులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ

ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ

సోమవరం గ్రామంలో ‘పల్లె పిలుస్తోంది రా.. కదలి రా!’

అధికారులతో కలిసి గ్రామస్థులతో సమావేశం

ప్రజల సమస్యలు తెలుసుకుని.. పరిష్కరిస్తానని భరోసా

పంచాయతీ కార్యాలయంలో రాత్రి బస

కశింకోట, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతి పల్లెకూ గ్రామ స్వరాజ్యం తీసుకురావాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పలు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నదని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశాల మేరకు మండలంలోని సోమవరం గ్రామంలో మంగళవారం ‘పల్లె పిలుస్తోంది రా.. కదలి రా!’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత తెల్లవారుజామున నాలుగు గంటలకు గ్రామానికి చేరుకున్న ఆయన ఐదు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు స్థానికులతో కలిసి యోగా, ప్రాణాయామం, ధాన్యం, సూర్య నమస్కారాలు చేశారు. తరువాత ఎన్‌టీఆర్‌ కల్యాణ మండపంలో గ్రామస్థులు, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖకు సంబంధించి కౌలు రైతులకు కార్డులు, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ యోజన, ప్రకృతి వ్యవసాయం, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు పంపిణీ గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పనులు ఎంత మేరకు జరిగాయో డ్వామా అధికారులను అడిగారు. ఇంకా పశు సంవర్థక, అటవీ శాఖలకు సంబంధించి పలు విషయాల గురించి ఆరా తీశారు. ప్రభుత్వ పథకాల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సంబంధిత అధికారులు, సిబ్బంది గ్రామానికి వచ్చి అందించేలా చర్యలు తీసుకుంటున్నామని కొణతాల తెలిపారు. మధ్యాహ్నం తరువాత పొలాలకు వెళ్లి పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. సాయంత్రం గ్రామంలో మహిళలకు ఆటల పోటీలు, యువకులకు వాలీబాల్‌, షటిల్‌ పోటీలు నిర్వహించారు. రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాత్రి బసచేశారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలోనే వుంటారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి డి.మోహన్‌రావు, మండల వ్యవసాయాధికారి స్వప్న, ఉద్యాన శాఖాధికారి ప్రభాకరరావు, మండల ఉద్యాన శాఖాధికారి ప్రవీణ లక్ష్మి, మైక్రో ఇరిగేషన్‌ మండలాధికారి రంజిత, సేంద్రియ వ్యవసాయాధికారి లచ్చన్న, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్‌ రామ్మోహన్‌రావు, ఏడీ సౌజన్య, సోషల్‌ ఫారెస్టు రేంజ్‌ అధికారి చంద్రశేఖర్‌, డిప్యూటీ రేంజ్‌ అధికారి నూకరాజు, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ సత్యనారాయణ, గవర కార్పొరేషన్‌ చైర్మన్‌ మళ్ల సురేంద్ర, తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి గొంతిన శ్రీనివాసరావు, కూటమి నాయకులు దూలం గోపీ, మంగా ఈశ్వర్‌, ఉగ్గిన రమణమూర్తి, సిదిరెడ్డి శ్రీనివాసరావు,తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2025 | 12:54 AM