బ్రహ్మకమలాల కనువిందు
ABN, Publish Date - Jun 01 , 2025 | 10:53 PM
అరుదైన బ్రహ్మకమలం పుష్పాలు ఐదు విరబూస్తేనే వాటిని అందరూ చూసేందుకు ఎగబడతారు.
ఒక కొమ్మకు 20 వరకు ఉన్న బ్రహ్మకమలం పుష్పాలు
గొందూరులో ఓ ఇంటి ముంగిట 60 వరకు వికసించిన పుష్పాలు
పాడేరు, జూన్ 1(ఆంధ్రజ్యోతి): అరుదైన బ్రహ్మకమలం పుష్పాలు ఐదు విరబూస్తేనే వాటిని అందరూ చూసేందుకు ఎగబడతారు. అటువంటిది పాడేరు శివారున గొందూరు ప్రాంతంలో టి.నాగబాబు అనే వ్యక్తి ఇంటి ముంగిట ఉన్న బ్రహ్మకమలం మొక్క ఏకంగా 60 వరకు పుప్వులతో ఆదివారం రాత్రి కనువిందు చేసింది. ఇటీవల కాలంలో ఎక్కువ సంఖ్యలో పుష్పాలు వికసించడం ఇదే ప్రథమం. దీంతో చుట్టుపక్కల జనం వచ్చి వాటిని తిలకించి, పులకించారు.
Updated Date - Jun 01 , 2025 | 10:53 PM