ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కలిసొచ్చిన వర్షాలు

ABN, Publish Date - May 25 , 2025 | 11:23 PM

మన్యంలో ఐదేళ్ల తరువాత మార్చి, ఏప్రిల్‌, మే మాసాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. సాధారణంగా గిరిజన ప్రాంతంలో మార్చి నుంచి మే వరకు వర్షాలు కురుస్తాయి. అయితే ఈ ఏడాది సాధారణ వర్షపాతానికి మించి వర్షాలు పడ్డాయి. ఆదివాసీలు వర్షాధారంగా సాగు చేస్తున్న సంప్రదాయేతర పంటలైన కాఫీ, మిరియాలకు పుష్కలంగా నీరు అందింది.

ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఐఎండీ ఆటోమేటిక్‌ వాతావరణ కేంద్రం

మన్యంలో మూడు నెలలుగా సాధారణ వర్షపాతానికి మించి నమోదు

కాఫీ, మిరియాల పంటలకు పుష్కలంగా నీరు

ఈ ఏడాది పెరగనున్న దిగుబడులు

చింతపల్లి, మే 25 (ఆంధ్రజ్యోతి): మన్యంలో ఐదేళ్ల తరువాత మార్చి, ఏప్రిల్‌, మే మాసాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. సాధారణంగా గిరిజన ప్రాంతంలో మార్చి నుంచి మే వరకు వర్షాలు కురుస్తాయి. అయితే ఈ ఏడాది సాధారణ వర్షపాతానికి మించి వర్షాలు పడ్డాయి. ఆదివాసీలు వర్షాధారంగా సాగు చేస్తున్న సంప్రదాయేతర పంటలైన కాఫీ, మిరియాలకు పుష్కలంగా నీరు అందింది. ఈ వర్షాలు కాఫీ, మిరియాల పంటలకు బాగా అనుకూలించాయి. దీని వల్ల ఈ ఏడాది దిగుబడులు పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

దక్షిణ భారతదేశంలో పాడేరు రెవెన్యూ డివిజన్‌ విభిన్న వాతావరణం కలిగి వుంటుంది. వేసవిలోనూ వర్షాలు కురవడం, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు మించి నమోదుకాకపోవడం మన్యం ప్రత్యేకత. శీతకాలంలో ఏజెన్సీ వ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. లంబసింగి, కుంతలం(జి.మాడుగుల) ప్రాంతాల్లో సున్న, మైనస్‌ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వర్షాకాలంలో వర్షాలు అధికంగా ఉంటాయి. పాడేరు రెవెన్యూ డివిజన్‌లో వార్షిక సాధారణ వర్షపాతం 1,250 మిల్లీమీటర్లు. గిరిజన ప్రాంత వాతావరణం భిన్నంగా ఉండడంతో ఈ ప్రాంతంలో అరుదైన పంటలు పండుతున్నాయి. కాఫీ పంటకు మార్చి నుంచి మే వరకు వర్షాలు అవసరం. వర్షాలు పడితేనే కాఫీ పంటకు పూత రావడం, పూత దశ నుంచి పిందె దశకు వస్తుంది. మార్చి నుంచి మే వరకు వర్షాలు కురుస్తుండడం వల్ల కాఫీ సాగుకి గిరిజన ప్రాంతం అనుకూలంగా మారింది.

గరిష్ఠ వర్షపాతం

గిరిజన ప్రాంతంలో మార్చి నుంచి మే వరకు ఈ ఏడాది గరిష్ఠ వర్షపాతం నమోదైంది. గత ఐదేళ్ల తరువాత మళ్లీ ఈ ఏడాది సాధారణ వర్షపాతానికి మించి వర్షాలు పడ్డాయి. సాధారణ వర్షపాతం మార్చిలో 20.8, ఏప్రిల్‌లో 76.8, మేలో 98.4 మిల్లీమీటర్లు కాగా, ఈ ఏడాది మార్చిలో 21.9, ఏప్రిల్‌లో 118.5, మే(25తేదీ వరకు) 140.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏప్రిల్‌ 14వ తేదీన 27, ఏప్రిల్‌ 23న 37.5, మే తొమ్మిదిన 22.2 మిల్లీమీటర్ల గరిష్ఠ వర్షపాతం నమోదైంది. గత ఐదేళ్లు మూడు మాసాల్లో 180 మిల్లీ మీటర్లు నుంచి 210 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది గరిష్ఠంగా మూడు నెలల్లో 280.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది ముందుగానే కేరళను నైరుతి రుతు పవనాలు తాకాయి. దీంతో రెండు, మూడు రోజుల్లో ఏపీకి రుతుపవనాలు చేరుకోనున్నాయి. నైరుతి పవనాలు ముందుగానే రావడంతో ఈ ఏడాది గిరిజన ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముంది.

కాఫీ, మిరియాలకు అనుకూలించిన వర్షాలు

ఈ ఏడాది కురిసిన వర్షాలు కాఫీ, మిరియాల పంటలకు బాగా అనుకూలించాయి. మార్చిలో కురిసిన వర్షాలకు సకాలంలో కాఫీ పూత ప్రారంభమైంది. ఏజెన్సీ వ్యాప్తంగా కాఫీ తోటలన్నీ ఏప్రిల్‌ మొదటి వారం నాటికి పూతకొచ్చాయి. ప్రస్తుతం పిందె దశకు చేరుకున్నాయి. మేలో కురిసిన వర్షాలు మిరియాల పంటకు కలిసొచ్చాయి. మూడు నెలలు వర్షాలు అధికంగా పడడంతో కాఫీ, మిరియాల పంటలకు పుష్కలంగా సాగునీరు అందడంతో తోటలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి.

Updated Date - May 25 , 2025 | 11:23 PM