ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తూలంలో మంచు మేఘాల సోయగం

ABN, Publish Date - Mar 21 , 2025 | 11:38 PM

అల్లూరి మన్యంలో మంచు అందాలు ముచ్చట గొలుపుతున్నాయి. కొత్తచోట్ల మంచు సోయగాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మండలంలోని ఇంజరి పంచాయతీ తూలం గ్రామంలో శుక్రవారం మంచు మేఘాలు స్థానికులకు ఆహ్లాదాన్ని పంచాయి.

తులం గ్రామ సమీపంలో మంచు మేఘాలు

పెదబయలు, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): అల్లూరి మన్యంలో మంచు అందాలు ముచ్చట గొలుపుతున్నాయి. కొత్తచోట్ల మంచు సోయగాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మండలంలోని ఇంజరి పంచాయతీ తూలం గ్రామంలో శుక్రవారం మంచు మేఘాలు స్థానికులకు ఆహ్లాదాన్ని పంచాయి. వంజంగి మేఘాల కొండ మాదిరిగా గ్రామ సమీపంలో మంచు మేఘాలు కమ్మేశాయి. ఆ మేఘాలపై ఉదయిస్తున్న లేలేత భానుడి కిరణాల దృశ్యం మైమరపించింది. వేసవి ఆరంభంలో ఇటువంటి సుందర దృశ్యం ఆవిష్కృతం కావడంతో స్థానికులు తమ సెల్‌ఫోన్లలో బంధించి సోషల్‌ మీడియాలో అల్లూరి జిల్లాలో మరో మేఘాల కొండ అంటూ షేర్‌ చేశారు.

Updated Date - Mar 21 , 2025 | 11:39 PM