బ్రేక్‌లు ఫెయిలై తుప్పల్లోకి దూసుకువెళ్లిన వైనం
ABN, Publish Date - Jun 07 , 2025 | 01:12 AM
గాజువాక డిపోకు చెందిన బస్సు (నంబర్ 16)కు శుక్రవారం రాత్రి ప్రమాదం తప్పింది.
మల్కాపురం/సింథియా, జూన్ 6 (ఆంధ్రజ్యోతి):
గాజువాక డిపోకు చెందిన బస్సు (నంబర్ 16)కు శుక్రవారం రాత్రి ప్రమాదం తప్పింది. దాదాపు 20 మంది ప్రయాణికులతో సింథియా నుంచి యారాడ వెళుతున్న బస్సు...గ్రామ సమీపానికి వెళ్లేసరికి బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో రోడ్డుపక్కనున్న ముళ్లపొదల్లోకి దూసుకువెళ్లింది. ఆ సమయంలో ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనకు గురై పెద్దపెద్ద కేకలు వేశారు. కొంతదూరం వెళ్లిన తరువాత బస్సు ఆగడంతో అందరూ ఉపిరిపీల్చుకున్నారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే గ్రామస్థులు సంఘటనా స్థలికి చేరుకుని ప్రయాణికులను జాగ్రత్తగా కిందకు దించారు. అదే ఈ బస్సు కొండ మీద ఉన్నప్పుడు బ్రేక్ ఫెయిలైనట్టయితే పెనుప్రమాదం సంభవించేదని, భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండాలంటే కండీషన్ ఒకటికి రెండుసార్లు చెక్ చేయాలని ప్రయాణికులు పలువురు కోరుతున్నారు.
Updated Date - Jun 07 , 2025 | 01:12 AM