ఇసుకాసురుల బరితెగింపు
ABN, Publish Date - Apr 30 , 2025 | 01:01 AM
ఇసుకాసురులు బరితెగించారు. చోడవరం, కె.కోటపాడు మండలాల సరిహద్దులో శారదా నదిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. సాధారణంగా నది గర్భంలో ఇసుక తవ్వుకుంటారు. కానీ ఇక్కడ నది గట్టును ఆనుకుని పది నుంచి పదిహేను అడుగుల లోతు మేర ఇసుక తవ్వుతున్నారు. ఇళ్ల నిర్మాణాలు, ఇతర పనుల కోసం సమీపంలో వున్న నదులు, గెడ్డల్లో నుంచి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం కల్పించిన వెసులుబాటును కొంతమంది నాయకులు తమకు అనుకూలంగా మార్చుకుని ఇసుక వ్యాపారం చేస్తున్నారు. విశాఖకు చెందిన ఓ వ్యక్తి.. చోడవరం మండలం లక్కవరం, కె.కోటపాడు మండలం చౌడువాడ పంచాయతీ శివారు మల్లంపాలెం, కొల్లువీధి పరిసరాల్లో యంత్రాలతో శారదా నది గట్లను ధ్వంసం చేసి, చెట్లను కూల్చివేసి ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నారు.
లక్కవరం వద్ద శారదా నది గట్టు ధ్వంసం
ఎక్స్‌కవేటర్లతో 15 అడుగుల మేర తవ్వకాలు
ట్రాక్టర్లతో విశాఖకు తరలింపు
నదికి వరదలు వస్తే.. గట్లకు గండ్లు పడే ప్రమాదం
చోద్యం చూస్తున్న రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు
చోడవరం, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): ఇసుకాసురులు బరితెగించారు. చోడవరం, కె.కోటపాడు మండలాల సరిహద్దులో శారదా నదిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. సాధారణంగా నది గర్భంలో ఇసుక తవ్వుకుంటారు. కానీ ఇక్కడ నది గట్టును ఆనుకుని పది నుంచి పదిహేను అడుగుల లోతు మేర ఇసుక తవ్వుతున్నారు. ఇళ్ల నిర్మాణాలు, ఇతర పనుల కోసం సమీపంలో వున్న నదులు, గెడ్డల్లో నుంచి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం కల్పించిన వెసులుబాటును కొంతమంది నాయకులు తమకు అనుకూలంగా మార్చుకుని ఇసుక వ్యాపారం చేస్తున్నారు. విశాఖకు చెందిన ఓ వ్యక్తి.. చోడవరం మండలం లక్కవరం, కె.కోటపాడు మండలం చౌడువాడ పంచాయతీ శివారు మల్లంపాలెం, కొల్లువీధి పరిసరాల్లో యంత్రాలతో శారదా నది గట్లను ధ్వంసం చేసి, చెట్లను కూల్చివేసి ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నారు. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా ట్రాక్టర్లతో విశాఖ నగర శివారు ప్రాంతాలకు తరలిస్తున్నారు. సుమారు నెల రోజుల నుంచి ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపు జరుగుతుంటే రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు పట్టించుకోవడంలేదు. ఇటీవల స్థానికులు స్పందించి, ఇసుక రవాణా చేసేందుకు వచ్చిన 16 ట్రాక్టర్లను పట్టుకుని రెవెన్యూ సిబ్బందికి అప్పగించారు. వాటిల్లో ఇసుక లేదంటూ రెవెన్యూ సిబ్బంది వదిలేశారు. ఇసుక కోసం శారదా నది గట్లను ధ్వంసం చేయడం వల్ల వర్షా కాలంలో వరదలు వస్తే గట్లకు గండ్లుపడి, పొలాలను ముంచెత్తే ప్రమాదం వుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Updated Date - Apr 30 , 2025 | 01:01 AM