ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆదమరిస్తే అంతే..

ABN, Publish Date - Jul 26 , 2025 | 12:29 AM

మండలంలోని పుత్తడిగైరంపేట పంచాయతీలోని నాగందొరపాలెం-ఎర్రవరం గ్రామాల మధ్యలో మదుం శిథిలావస్థకు చేరి, మధ్యలో కొంతభాగం కూలిపోయింది. వాస్తవంగా మూడేళ్ల క్రితం చిన్నపాటి రధ్రం ఏర్పడగా.. పంచాయతీ రాజ్‌ అధికారులు మరమ్మతులు చేయించలేదు. దీంతో క్రమేపీ రధ్రం పెద్దగామారి ఇటీవల రోడ్డు మధ్యలో కూలిపోయింది.

మదుం కూలిపోవడంతో రోడ్డు మధ్యలో ఏర్పడిన భారీ గొయ్యి

నాగందొరపాలెం-ఎర్రవరం మధ్య కూలిన మదుం

రోడ్డు మధ్యలో భారీ గొయ్యి

రక్షణ చర్యలు చేపట్టని పీఆర్‌ అధికారులు

ప్రమాదాలబారిన వాహనదారులు

గొలుగొండ, జూలై 25(ఆంధ్రజ్యోతి): మండలంలోని పుత్తడిగైరంపేట పంచాయతీలోని నాగందొరపాలెం-ఎర్రవరం గ్రామాల మధ్యలో మదుం శిథిలావస్థకు చేరి, మధ్యలో కొంతభాగం కూలిపోయింది. వాస్తవంగా మూడేళ్ల క్రితం చిన్నపాటి రధ్రం ఏర్పడగా.. పంచాయతీ రాజ్‌ అధికారులు మరమ్మతులు చేయించలేదు. దీంతో క్రమేపీ రధ్రం పెద్దగామారి ఇటీవల రోడ్డు మధ్యలో కూలిపోయింది. అధికారులు అక్కడ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ రోడ్డు ద్వారా పీఎన్‌డీ పాలెం, పెసరాడ, సుద్దలపాలెం గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొత్త మదుము నిర్మించాలని వారు కోరుతున్నారు. దీనిపై పీఆర్‌ డీఈ ఈశ్వరరావును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. నూతనం మదుం నిర్మాణానికి నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. అనుమతులు లభించిన వెంటనే పనులు చేపడతామని చెప్పారు.

Updated Date - Jul 26 , 2025 | 12:29 AM