ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సైబర్‌ ముఠాల చేతిలో తెలుగు యువకులు

ABN, Publish Date - Aug 01 , 2025 | 12:46 AM

ఐటీ, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాలంటూ ఆశపెట్టి థాయ్‌లాండ్‌ తీసుకువెళ్లి సైబర్‌ నేరాలు చేయించే ముఠా చేతిలో నగరంతోపాటు వివిధ జిల్లాలకు చెందిన తెలుగు యువకులు చిక్కుపోయారు.

  • ఐటీ, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాలంటూ ఆశపెట్టి థాయ్‌లాండ్‌ పంపిన ఏజెంట్లు

  • చిత్రహింసలు పెట్టి స్కామ్‌లు చేయిస్తున్న ముఠా సభ్యులు

  • కాపాడాలంటూ బాధితుల వీడియో

విశాఖపట్నం, జూలై 31 (ఆంధ్రజ్యోతి):

ఐటీ, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాలంటూ ఆశపెట్టి థాయ్‌లాండ్‌ తీసుకువెళ్లి సైబర్‌ నేరాలు చేయించే ముఠా చేతిలో నగరంతోపాటు వివిధ జిల్లాలకు చెందిన తెలుగు యువకులు చిక్కుపోయారు. తమను ముఠా సభ్యులు చిత్రహింసలకు గురిచేస్తున్నందున కాపాడాలంటూ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను ఉద్దేశించి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అందులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి.

నగరంలోని గోపాలపట్నం ప్రాంతంతోపాటు విజయనగరం, కడప, తదితర ఇతర జిల్లాలకు చెందిన సుమారు 15 మంది యువకులు ఉద్యోగాల కోసం నెల కిందట థాయ్‌లాండ్‌ వెళ్లారు.

డేటా ఎంట్రీ ఆపరేటర్‌, కంపెనీలో రిసెప్షన్‌, హోటల్‌లో ఉద్యోగాలు ఉన్నాయంటూ ఏజెంట్లు నమ్మించడంతో మొదట ముగ్గురు వెళ్లారు. వారికి డేటా ఎంట్రీ ఆపరేటర్‌, హాటల్‌లో, రిసెప్షన్‌ ఉద్యోగాలు ఇచ్చినట్టు ముఠా సభ్యులు నమ్మించారు. 15 రోజులు వరకూ వారిని బాగానే చూసుకోవడంతో వారి ద్వారా వారి స్నేహితులైన మరో 12 మంది పదిహేను రోజుల కిందట థాయ్‌లాండ్‌ వెళ్లారు. అక్కడకు 12 మంది చేరిన తర్వాత, ముందు వెళ్లిన ముగ్గురిని కలిపి వేరొకచోట ఉద్యోగం చేయాల్సి ఉంటుందని వారి పాస్‌పోర్టులు తీసుకుని వాహనాలు ఎక్కించారు. వారి కళ్లకు గంతలు కట్టి సుమారు 15 వాహనాలు మార్చి, ఒకటిన్నర రోజులు వాహనాల్లోనే వేర్వేరు ప్రాంతాలు తిప్పారు. చివరకు ఆనవాళ్లు కూడా తెలియని ఒకచోట గదిలో ఉంచారు. ఎక్కడకు తీసుకువచ్చారని ముఠా సభ్యులను ఇద్దరు యువకులు ప్రశ్నించగా చైనా జాతీయుల మాదిరిగా ఉన్న కొందరువచ్చి వారిని కొట్టడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. అందరూ ఆడవారి గొంతుతో ఫోన్‌లో మాట్లాడి సైబర్‌స్కామ్‌ చేయాలని ఆదేశించారు. తమకు అంతగా ఇంగ్లీష్‌రాదని, చాటింగ్‌ కూడా సరిగా చేయలేమని ఒక యువకుడు చెప్పగా, అతడిని గదిలోకి తీసుకువెళ్లి ఇనుప హాకీ స్టిక్‌తో రక్తం వచ్చేలా కొట్టారు. దీంతో అందరూ భయపడి సైబర్‌స్కామ్‌ చేయడం ప్రారంభించారు. రోజుకు మొదట 16 గంటలు, తర్వాత 18 గంటలు, తర్వాత 20 గంటలు పనిచేయాలని చెప్పడంతో వారం గడిచేసరికి తాము చేయలేమని చేతులెత్తేయగా కొట్టడంతోపాటు దుస్తులు విప్పించి చిత్రహింసలకు గురిచేశారు. తాము ఇంకా వారి వేధింపులను తట్టుకోలేమని, ఫోన్‌ చేయడానికి కూడా అవకాశం లేకుండా ఒకరు కాపలా ఉంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తాము ఉంటున్న లొకేషన్‌ను పంపిస్తామని, ఆ ముఠా చేతుల్లోనుంచి తమను రక్షించి ఇండియా వచ్చేలా చేయాలని పవన్‌కల్యాణ్‌ను వేడుకున్నారు. ఇంతలో ఎవరో వస్తున్నట్టు చప్పుడు కావడంతో వీడియోను ఆపేశారు. అయితే వీడియోలో మాట్లాడిన వారి పూర్తి వివరాలు మాత్రం తెలియలేదు. దీనిపై ఇప్పటికే నగర పోలీసులు దృష్టిసారించి వారిని గుర్తించే ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలిసింది.

Updated Date - Aug 01 , 2025 | 12:46 AM