ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మహానాడుకు టీడీపీ శ్రేణులు

ABN, Publish Date - May 27 , 2025 | 01:38 AM

కడపలో మంగళవారం నుంచి జరగనున్న మహానాడులో పాల్గొనేందుకు నగరం నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి.

నగరం నుంచి 50 వాహనాల్లో బయలుదేరిన కార్యకర్తలు

విశాఖపట్నం, మే 26 (ఆంధ్రజ్యోతి):

కడపలో మంగళవారం నుంచి జరగనున్న మహానాడులో పాల్గొనేందుకు నగరం నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి. విశాఖ పార్లమెంటు నియోజకవర్గం నుంచి 50 వాహనాలలో (బస్సులు, కార్లు, మినీ బస్సులు అన్ని కలిపి) నాయకులు, కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి బయలుదేరిన బస్సులకు ఎంపీ ఎం.శ్రీభరత్‌ జెండా ఊపారు. పార్లమెంటు నియోజకవర్గం నుంచి రెండు వేల మంది వరకూ వెళుతున్నామని అధ్యక్షుడు గండి బాబ్జీ తెలిపారు. కడపలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వసతి కల్పించారని వివరించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జులు కడప, పరిసర పట్టణాలు, తిరుపతిలో వసతి గృహాలు బుక్‌ చేసుకున్నారని తెలిపారు.

Updated Date - May 27 , 2025 | 01:39 AM