పాలీసెట్‌లో విశాఖ విద్యార్థుల ప్రతిభ
ABN, Publish Date - May 15 , 2025 | 01:03 AM
సాంకేతిక విద్యాశాఖ బుధవారం విడుదల చేసిన పాలీసెట్ ఫలితాల్లో విశాఖ జిల్లా 96.11ు ఉత్తీర్ణత సాధించింది. ఈ మేరకు జిల్లా విద్యార్థులు పొందిన ఫలితాలను ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా పాలీసెట్ కో-ఆర్డినేటర్ డాక్టర్ కె.నారాయణరావు వెల్లడించారు.
రాష్ట్ర స్థాయిలో జిల్లాకు 2, 8, 26 ర్యాంకులు
మొత్తం 96.11 శాతం మంది ఉత్తీర్ణత
కంచరపాలెం, మే 14 (ఆంధ్రజ్యోతి):
సాంకేతిక విద్యాశాఖ బుధవారం విడుదల చేసిన పాలీసెట్ ఫలితాల్లో విశాఖ జిల్లా 96.11ు ఉత్తీర్ణత సాధించింది. ఈ మేరకు జిల్లా విద్యార్థులు పొందిన ఫలితాలను ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా పాలీసెట్ కో-ఆర్డినేటర్ డాక్టర్ కె.నారాయణరావు వెల్లడించారు. ఈ ఏడాది పాలీసెట్‌కు జిల్లాలో 7,421 మంది బాలురు హాజరు కాగా వీరిలో 7,077 మంది (95.36ు), బాలికలు 4,944 మంది హాజరవ్వగా 4,807 మంది (97.23ు) ఉత్తీర్ణత సాధించారన్నారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు బాలినేని కల్యాణ్‌రామ్ (120/120 మార్కులు) రెండో ర్యాంకు, చింతాడ
చోహాన్ (120/120 మార్కులు) 8వ ర్యాంకు సాధించారు. సబ్బవరపు హనీష్ విరాట్ (119/120) సాధించి 26వ ర్యాంకు సాధించినట్టు పేర్కొన్నారు.
Updated Date - May 15 , 2025 | 01:03 AM