ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సీ ప్లేన్‌ కోసం సర్వే

ABN, Publish Date - Jul 16 , 2025 | 11:38 PM

విశాఖపట్నం నుంచి సీలేరుకు సీ ప్లేన్‌ నడిపేందుకు చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి బుధవారం విజయవాడకు చెందిన ఆపరేషన్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీ(ఓఎంటీ) బృందం జీకేవీధి మండలం సీలేరులో పర్యటించింది.

సీలేరులో సీ ప్లేన్‌ నిర్వహణ కోసం జలాశయం లోతు పరిశీలనకు బోటుపై వెళుతున్న ఓఎంటీ బృందం

గుంటవాడ జలాశయాన్ని పరిశీలించిన ఓఎంటీ బృందం

ఎక్కడ ఎంత లోతు ఉందో నిర్ధారణ

నిర్వహణకు అనుకూలంగా ఉన్నట్టు వెల్లడి

సీలేరు, జూలై 16 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం నుంచి సీలేరుకు సీ ప్లేన్‌ నడిపేందుకు చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి బుధవారం విజయవాడకు చెందిన ఆపరేషన్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీ(ఓఎంటీ) బృందం జీకేవీధి మండలం సీలేరులో పర్యటించింది. సీ ప్లేన్‌ ల్యాడింగ్‌ అయ్యేందుకు పోర్టు ఏర్పాటుకు ఇటీవల తహశీల్దార్‌, జెన్‌కో అధికారులు ఎంపిక చేసిన గుంటవాడ జలాశయం (సీలేరు జలాశయం)ను బృందం సభ్యులు పరిశీలించారు. గుంటవాడ జలాశయంలో వివిధ ప్రదేశాలలో లోతు (డెప్త్‌) ఎంత ఉందో లొకేషన్‌ యాప్‌తో సర్వే నిర్వహించారు. ఎక్కడ ఎంత లోతు ఉందో పరిశీలించారు. సీ ప్లేన్‌ ల్యాండింగ్‌అయ్యేందుకు అనువైన లోతు ఉందా?, లేదా? అనే అంశాలను పరిశీలించారు. అలాగే రోడ్డు మార్గానికి జలాశయం ఎంత దిగువన ఉంది అదే దానిపై సర్వే చేశారు. సీ ప్లేన్‌ ల్యాండింగ్‌కు అనుకూల ప్రదేశం, దీనికి అవసరమైన పోర్టు నిర్మాణం ఏర్పాటుకు సంబంధించిన సర్వే నిర్వహించినట్టు ఓఎంటీ బృందం ప్రతినిధులు తెలిపారు. ఇక్కడ సీ ప్లేన్‌ నిర్వహణకు అనుకూలంగా ఉన్నట్టు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో తన్సీ జమీల్‌ (అసోసియేట్‌ ఫ్రమ్‌ ఫీడ్‌బ్యాక్‌ హైవేస్‌), సూపర్‌వైజర్లు మిశ్రా, ప్రవీణ్‌, వీఆర్వో స్వరూప్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 16 , 2025 | 11:38 PM